UP: చివరి నిమిషంలో ఇదేం ట్విస్టు.. చనిపోయారనుకున్న సోదరీమణులు తిరిగొస్తే..
ABN , Publish Date - May 01 , 2024 | 09:36 AM
నిత్య జీవితంలో కొన్ని సంఘటనలు ఊహించని షాక్‌కి గురి చేస్తాయి. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో(Uttarpradesh) జరిగింది. ఇద్దరు సోదరీమణులు ఏడాది క్రితం హత్యకు గురయ్యారని భావిస్తే ఒక నిర్దోషికి శిక్ష పడుతుందనే కారణంతో వారు తిరిగి వచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోరఖ్‌పుర్‌కు చెందిన సీత(20), గీత(21) ఇద్దరు సోదరీమణులు. వీరు ఏడాది క్రితం తప్పిపోయారు.
లక్నో: నిత్య జీవితంలో కొన్ని సంఘటనలు ఊహించని షాక్‌కి గురి చేస్తాయి. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో(Uttarpradesh) జరిగింది. ఇద్దరు సోదరీమణులు ఏడాది క్రితం హత్యకు గురయ్యారని భావిస్తే నిర్దోషికి శిక్ష పడుతుందనే కారణంతో ఇద్దరూ తిరిగి వచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోరఖ్‌పుర్‌కు చెందిన సీత(20), గీత(21) ఇద్దరు సోదరీమణులు. వీరు ఏడాది క్రితం తప్పిపోయారు.
వారిని హత్య చేసి ఉండవచ్చని కుటుంబసభ్యులు భావించారు. వారి సోదరుడు అజయ్.. సీత, గీత తప్పిపోయారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారితో జయనాథ్ మౌర్య అనే వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకున్నాడని.. అతనే హత్య చేశాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే సరైన ఆధారాలు లేని కారణంగా పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో అజయ్ కోర్టును ఆశ్రయించాడు.
ఒక సంవత్సరం తర్వాత జనవరి 8, 2024న కోర్టు ఆదేశాల మేరకు గోరఖ్‌పూర్‌లోని బెల్‌ఘాట్ పోలీస్ స్టేషన్‌లో జయనాథ్‌పై హత్య కేసు నమోదైంది. నాలుగు నెలల విచారణలో ఇద్దరు బతికే ఉన్నారని, ప్రేమించిన వారి కోసం వారు ఇంటి నుండి పారిపోయారని పోలీసులు గుర్తించారు. తమ సోదరుడు పెట్టిన హత్య కేసు గురించి తెలుసుకున్న సోదరీమణులు నిర్దోషికి శిక్ష పడకుండా ఉండేందుకు పోలీసులను ఆశ్రయించారు.
సీత.. హరియాణాకు చెందిన విజేందర్‌ని పెళ్లి చేసుకున్నానని.. అతనితో కలిసి జీవిస్తున్నట్లు తెలిపింది. తనకు ఐదు నెలల కుమార్తె కూడా ఉందని పోలీసులకు చెప్పింది. గీత.. ఉత్తరాఖండ్ రాష్ట్రం అల్మోరాకు చెందిన సురేష్ రామ్‌తో పెళ్లి చేసుకోవడానికి ఇంటి నుంచి పారిపోయిందని పోలీసులకు తెలిపింది. తనకు 6 నెలల కుమార్తె కూడా ఉన్నట్లు చెప్పింది. చనిపోయారని భావిస్తున్న ఇద్దరు సోదరీమణులు తిరిగి వచ్చినందుకు వారి కుటుంబం ఒకింత షాక్‌కి గురైనా, ఆనందం వ్యక్తం చేశారు.
Read Latest News and National News here