Share News

Skin Care: ముఖం మీద మచ్చలు పోయి అద్దంలా మెరవాలా? బంగాళదుంపను ఇలా వాడి చూడండి..!

ABN , Publish Date - May 14 , 2024 | 04:28 PM

ఇప్పట్లో అమ్మాయిల ముఖం స్పష్టంగా, స్వచ్చంగా, తేటగా, చందమామలా ఉండంటం చాలా అరుదు. చాలావరకు ముఖం మీద మచ్చలు, మొటిమలు, వాటి తాలూకు గుర్తులతో ముఖం నిండిపోయి ఉంటుంది.

Skin Care: ముఖం మీద మచ్చలు పోయి అద్దంలా మెరవాలా? బంగాళదుంపను ఇలా వాడి చూడండి..!

అందంగా కనిపించాలని కోరుకోని అమ్మాయి ఉండదంటే అతిశయోక్తి కాదు. కానీ ఇప్పట్లో అమ్మాయిల ముఖం స్పష్టంగా, స్వచ్చంగా, తేటగా, చందమామలా ఉండంటం చాలా అరుదు. చాలావరకు ముఖం మీద మచ్చలు, మొటిమలు, వాటి తాలూకు గుర్తులతో ముఖం నిండిపోయి ఉంటుంది. ఇక ఇప్పట్లో అందుబాటులో ఉన్న వాణిజ్య ఉత్పత్తులు ఇస్తున్న ఫలితాలు అందరికీ తెలిసివే.. అయితే ముఖం మచ్చలు లేకుండా అందంగా కనిపించాలంటే బంగాళదుంపను ఈ కింది విధంగా వాడితే సరిపోతుంది.

పోషకాలు..

బంగాళదుంపలో విటమిన్లు, జింక్, సల్ఫర్, కాపర్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు, బ్లీచింగ్ గుణాలు ఉన్నాయి. ఇవి చర్మానికి ఒకటి కాదు అనేక ప్రయోజనాలను అందిస్తాయి. బంగాళాదుంపను ముఖానికి రాసుకుంటే పొడి చర్మం సమస్య పోతుంది. పిగ్మెంటేషన్ తగ్గి ముఖం కాంతివంతంగా మారుతుంది. మచ్చలు తగ్గుతాయి. మచ్చలేని మెరుపును పొందడానికి బంగాళదుంపను కింది విధంగా ఉపయోగించాలి.

ఈ అలవాట్లు ఉన్నవారు మేధావులు అవుతారట..!


బంగాళదుంపను ముఖానికి ఉపయోగించే మొదటి మార్గం దాని రసాన్ని తీసి ముఖానికి టోనర్‌గా అప్లై చేయడం. ఇందు కోసం ఒక బంగాళదుంపను తీసుకొని దానిని తురమాలి. ఈ తురుమును పిండి రసాన్ని వేరు చేయాలి. బంగాళదుంప రసాన్ని చర్మానికి పట్టించాలి. ఈ రసాన్ని కాటన్ సహాయంతో మొత్తం ముఖంపై అప్లై చేసి 10 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి. బంగాళదుంప రసాన్ని ప్రతి రెండు లేదా మూడు రోజులకు ఒకసారి ముఖంపై అప్లై చేస్తుంటే మచ్చలు తగ్గుతాయి.

చర్మం మెరిసిపోవాలంటే బంగాళదుంప ఫేస్ ప్యాక్ అప్లై చేయవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ కోసం సగం బంగాళదుంప తీసుకొని తురమాలి. అందులో అర చెంచా శనగ పిండిని కలిపి అర చెంచా నిమ్మరసం కలపాలి. అవసరాన్ని బట్టి నీటిని చేర్చుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ ను ముఖానికి అప్లై చేయండి. 15 నుండి 20 నిమిషాల పాటు ఉంచిన తర్వాత ముఖం కడగాలి. చర్మం మెరిసిపోతుంది. ఈ మిశ్రమాన్ని ముఖంపై రుద్దుతూ ముఖం కడుక్కోవడం వల్ల ఇది ఫేస్ వాష్ గా కూడా పనిచేస్తుంది.

లాప్టాప్ ను ఒడిలో పెట్టుకుని వాడే అలవాటుందా? ఈ నిజాలు తెలిస్తే..!


మచ్చలు తొలగిపోయి చర్మం మృదువుగా మారాలంటే బంగాళదుంప రసం, పాలు కలిపి ముఖానికి రాసుకోవచ్చు. ఇందు కోసం 2 స్పూన్ల పాలు, ఒక బంగాళదుంప రసం మిక్స్ చేయాలి. ఈ మిశ్రమానికి కొన్ని చుక్కల గ్లిజరిన్ జోడించవచ్చు. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని కాటన్ సహాయంతో ముఖానికి పట్టించి కొంత సమయం తర్వాత ముఖాన్ని కడిగి శుభ్రం చేసుకోవాలి. బంగాళదుంప రసాన్ని ఇలా వారానికి రెండు సార్లు ముఖానికి రాసుకోవచ్చు.

లాప్టాప్ ను ఒడిలో పెట్టుకుని వాడే అలవాటుందా? ఈ నిజాలు తెలిస్తే..!

ఈ అలవాట్లు ఉన్నవారు మేధావులు అవుతారట..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - May 14 , 2024 | 04:28 PM