Share News

Skin Tan: ముఖం మీద ట్యాన్ ను తొలగించడానికి కష్టపడక్కర్లేదు.. ఈ 5 కూరగాయలలో ఏ ఒక్కటి వాడినా చాలు..!

ABN , Publish Date - Jul 25 , 2024 | 11:34 AM

స్కిన్ ట్యాన్ అందంగా ఉన్న ముఖాన్ని కూడా అందవిహీనంగా మార్చే సమస్య. ఇది తీవ్రమైన సూర్యుడి కిరణాలకు చర్మం గురికావడం వల్ల వస్తుంది. ముఖం మీద కొన్ని ప్రాంతాలలో మాత్రమే చర్మం నల్లగా మారుతుంది. దీన్ని వదలించుకోవడానకి చాలామంది మార్కెట్లో దొరితే డి-ట్యాన్ పౌడర్లు, క్రీమ్ లు, స్క్రబ్ లు ఉపయోగిస్తూ ఉంటారు. కానీ..

Skin Tan: ముఖం మీద ట్యాన్ ను తొలగించడానికి కష్టపడక్కర్లేదు.. ఈ 5 కూరగాయలలో ఏ ఒక్కటి వాడినా చాలు..!
Sun Tan

స్కిన్ ట్యాన్ అందంగా ఉన్న ముఖాన్ని కూడా అందవిహీనంగా మార్చే సమస్య. ఇది తీవ్రమైన సూర్యుడి కిరణాలకు చర్మం గురికావడం వల్ల వస్తుంది. ముఖం మీద కొన్ని ప్రాంతాలలో మాత్రమే చర్మం నల్లగా మారుతుంది. దీన్ని వదలించుకోవడానకి చాలామంది మార్కెట్లో దొరితే డి-ట్యాన్ పౌడర్లు, క్రీమ్ లు, స్క్రబ్ లు ఉపయోగిస్తూ ఉంటారు. మరికొందరు పార్లర్ ట్రీట్మెంట్ తీసుకుంటారు. అయితే ఈ ట్యాన్ ను తొలగించడానికి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉండే 5 రకాల కూరగాయలను ఉపయోగించి ట్యాన్ ను తొలగించవచ్చు. అవేంటో.. అవెలా ఉపయోగించాలో తెలుసుకుంటే..

Raw Milk: ఖరీదైన క్రీములు కాదు.. పచ్చి పాలు ఇలా రోజూ ముఖానికి రాసుకోండి.. మెరిసిపోతారు..!



టమాటో..

టమాటో చర్మం మీద టాన్ ను తొలగించడంలో చక్కగా సహాయపడుతుంది. టమాటోను సగానికి కట్ చేసి మచ్చలు, టాన్ ఉన్న ప్రాంతంలో రుద్దాలి. ఇది చర్మం ఎర్రబారడాన్ని, చర్మం దెబ్బతినడాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

కాలీఫ్లవర్..

కాలిఫ్లవర్ లో ఉండే సమ్మేళనాలు చర్మం బయటి పొర ఎండకు దెబ్బతినకుండా చేస్తుంది. కాలీఫ్లవర్ రసాన్ని ముఖానికి అప్లై చేస్తుంటే ముఖం మీద టాన్ మంత్రించినట్టు మాయం అవుతుంది.

బంగాళాదుంప..

బంగాళాదుంప రసానికి సహజ బ్లీచింగ్ లక్షణాలు ఉంటాయి. బంగాళదుంపను మిక్సీ వేసి పేస్ట్ చేసి ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసుకోవచ్చు. లేదంటే బంగాళాదుంప రసాన్ని అయినా ముఖానికి రాసుకోవచ్చు. బంగాళాదుంప ముక్కలతో నేరుగా చర్మం మీద రుద్దవచ్చు.

Stomach Problems: పొట్టకు సంబంధించి అన్ని సమస్యలకు ఒకటే మందు.. ఈ పొడిని రోజూ తీసుకుంటే..!



క్యారెట్..

వారానికి రెండుసార్లు క్యారెట్ ను ముఖం మీద రుద్దుతూ ఉంటే పార్లర్ లాంటి మెరుపు వస్తుంది. ఇది నల్లబడిన చర్మాన్ని కాంతివంతం చేయడమే కాకుండా చర్మం ఎండకు దెబ్బతినకుండా కాపాడుతుంది.

చిలకడదుంప..

చిలగడదుంపలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. మచ్చలేని చర్మం కావాలని అనుకునేవారికి ఇది చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే పిండి పదార్థాలు చర్మం మీద టాన్ ను తొలగించడంలో సహాయపడుతుంది.

బరువు తగ్గాలనుకునే వారికోసం భలే టిఫిన్లు.. వీటిలో కేలరీలు చాలా తక్కువ..!

మెచ్యురిటీ ఉన్న అబ్బాయిలలో ఈ లక్షణాలు ఉంటాయి..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jul 25 , 2024 | 11:34 AM