Share News

Viral Video: వామ్మో.. గాల్లోకి ఎగిరిన పామును ఎలా పట్టుకున్నాడో చూడండి.. షాకింగ్ వీడియో వైరల్..

ABN , Publish Date - Sep 24 , 2024 | 11:20 AM

ఈ ప్రపంచంలో అతి ఎక్కువ మంది పాములంటేనే భయపడతారు. పాములున్నాయని తెలిస్తే అటువైపు వెళ్లడానికి కూడా జంకుతారు. అయితే కొద్ది మంది మాత్రమే పాములతో ధైర్యంగా వ్యవహరిస్తారు. ఇళ్లలోకి, జనావాసాల్లోకి వచ్చేసిన పాములను పట్టుకుంటారు.

Viral Video: వామ్మో.. గాల్లోకి ఎగిరిన పామును ఎలా పట్టుకున్నాడో చూడండి.. షాకింగ్ వీడియో వైరల్..
snake catching video

ఈ ప్రపంచంలో అతి ఎక్కువ మంది పాములంటేనే (Snake) భయపడతారు. పాములున్నాయని తెలిస్తే అటువైపు వెళ్లడానికి కూడా జంకుతారు. అయితే కొద్ది మంది మాత్రమే పాములతో ధైర్యంగా వ్యవహరిస్తారు. ఇళ్లలోకి, జనావాసాల్లోకి వచ్చేసిన పాములను పట్టుకుంటారు. పాముల నుంచి మనుషులను, మనుషుల నుంచి పాములను రక్షిస్తారు. అలాంటి ఎన్నో వీడియోలు (Snake Videos) ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి గాల్లోకి ఎగురుతున్న పామును చాకచక్యంగా పట్టుకున్నాడు. ఆ వీడియో చాలా మందిని ఆకట్టుకుంటోంది (Viral Videos).


motivation__line అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ లోపలికి పాము దూరినట్టు సమాచారం అందుకున్న నిపుణుడు అక్కడకు చేరుకున్నాడు. ఓ కర్ర తీసుకుని ట్రాన్స్‌ఫార్మర్‌ లోపలికి పొడుస్తూ పామును బయటకు రప్పించేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో హఠాత్తుగా ఓ పాము ట్రాన్స్‌ఫార్మర్ లోపలి నుంచి గాల్లోకి ఎగిరింది. వెంటనే ఆ వ్యక్తి ఒట్టి చేతులతో పామును పట్టుకున్నాడు. ఇదంతా సెకెన్ల వ్యవధిలో జరిగిపోయింది. ఆ వ్యక్తి ధైర్యం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది.


సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోను దాదాపు 3 కోట్ల మంది వీక్షించారు. 9.6 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందనలు తెలియజేశారు. ``ఈ వ్యక్తిని చూసి యమరాజ్ కూడా భయపడతాడేమో``, ``ఆ వ్యక్తి ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే``, ``చాలా వేగంగా స్పందించాడు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: అంత పెద్ద చిరుతపులి.. ఉడుతకు లోకువే.. చెట్టు మీద ఎలా ఆటాడుకుందో చూడండి..


Viral Video: మనవడి కోసం వినూత్న ట్రెడ్‌మిల్ తయారు చేసిన తాత.. ఆ కుర్రాడి బాధలు చూస్తే నవ్వు రాక తప్పదు..


Viral Video: ఓరి నాయనో.. రన్నింగ్ ట్రైన్‌లో కూడా పాము.. ఏసీ కోచ్‌లో ప్రత్యక్షమైన నాగరాజు.. ప్రయాణికుల కేకలు..


Optical Illusion: మీవి డేగ కళ్లని అనుకుంటున్నారా?.. అయితే 10 సెకెన్లలో ఈ ఫొటోల కొవ్వొత్తిని వెతకండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 24 , 2024 | 11:20 AM