Viral Video: మాట నిలబెట్టుకున్న పేద తండ్రి.. బోర్డ్ ఎగ్జామ్స్‌లో టాప్ వచ్చిన కొడుక్కి కాస్ట్లీ గిఫ్ట్.. ఏంటంటే..
ABN , Publish Date - Sep 29 , 2024 | 02:59 PM
పరీక్షల్లో మంచి మార్కులు వస్తే మంచి గిఫ్ట్ కొనిస్తామని, ఎక్కడికైనా తీసుకెళ్తామని తమ తాహతుకు తగినట్టు పిల్లలకు పేరెంట్స్ వాగ్ధానాలు చేస్తారు. పేదవాళ్లు కూడా తమ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఏవో ప్రామిస్‌లు చేస్తుంటారు. ఓ వ్యక్తి తన కుమారుడికి కూడా అలాగే వాగ్ధానం చేసి తాజాగా దానిని నిలబెట్టుకున్నాడు.
బోర్డు ఎగ్జామ్స్‌లో (Board Exams) మంచి మార్కులు తెచ్చుకునేలా పిల్లలను ప్రోత్సహించడానికి తల్లిదండ్రులు ఏం చేస్తారు? అనుకున్నన్ని మార్కులు వస్తే మంచి గిఫ్ట్ కొనిస్తామని, ఎక్కడికైనా తీసుకెళ్తామని తమ తాహతుకు తగినట్టు వాగ్ధానాలు చేస్తారు. పేదవాళ్లు కూడా తమ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఏవో ప్రామిస్‌లు చేస్తుంటారు. ఓ వ్యక్తి తన కుమారుడికి (Son) కూడా అలాగే వాగ్ధానం (Promise) చేసి తాజాగా దానిని నిలబెట్టుకున్నాడు. ఆ వ్యక్తి పాత వస్తువులు కొనే షాప్‌లో పని చేసే కార్మికుడు. ఆ వ్యక్తి కొడుకు గత విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షలు రాశాడు. అప్పుడు ఆ వ్యక్తి తన కొడుకును ప్రోత్సహించేందుకు ఓ ఖరీదైన వాగ్ధానం చేశాడు (Viral Video).
@gharkekalesh అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. స్క్రాప్ షాప్‌లో పని చేసే వ్యక్తి తన వాగ్ధానాన్ని నిలబెట్టుకున్నాడు. పదో తరగతి బోర్డ్ ఎగ్జామ్స్‌లో మంచి మార్కులు తెచ్చుకుంటే ఏకంగా ఐఫోన్ 16 (iPhone 16) కొనిస్తానని కొడుక్కి మాటిచ్చాడు. ఆ కుర్రాడు కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకున్నాడు. దీంతో ఆ తండ్రి తన మాట నిలబెట్టుకునే పనిలో పడ్డాడు. ఏకంగా లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఐఫోన్ 16 కొని తన కొడుక్కి గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 11 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. 12 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``తండ్రి ప్రేమకు పరిమితులు లేవు``, ``ఓ తండ్రి తన పిల్లల కోసం ఎంత కష్టమైనా పడతాడు``, ``ఇది నిజమైన వీడియోనేనా? సోషల్ మీడియా కోసం క్రియేట్ చేశారా?``, ``ఇది నిజంగా ఎమోషనల్ వీడియో``, ``ఆ వ్యక్తి మొహంలో ఆనందం చూడండి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: వేగంగా వెళ్తున్న బైక్‌పై విన్యాసాలు.. చివరకు ఆ యువకుడి పరిస్థితి ఏమైందంటే..
Viral: 17 ఏళ్ల క్రితం బార్ బిల్లు వైరల్.. 2007లో ఢిల్లీ బార్‌లో పార్టీ చేసుకుంటే ఎంత ఖర్చైందంటే..
Optical Illusion: మీ కళ్ల సామర్థ్యానికి పరీక్ష.. ఈ ఫొటోలో పాము ఎక్కడుందో 8 సెకెన్లలో కనుక్కోండి...
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..