Viral: మహిళ అకౌంట్‌లో పొరపాటున రూ. 6 కోట్లు.. దేవుడిచ్చాడనుకుని ఆమె..
ABN , Publish Date - May 16 , 2024 | 06:59 PM
ఓ మహిళ బ్యాంకు అకౌంట్లో పొరపాటున రూ. 6 కోట్లు డిపాజిట్ అయితే ఆమె ముందూ వెనకా ఆలోచించకుండా ఖర్చు చేసింది. ఆ తరువాత వచ్చిన సమస్య నుంచి ఆమె ఐదేళ్ల తరువాత చావు తప్పి కన్ను లొట్టపోయిన స్థితిలో బయటపడింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐదేళ్ల క్రితం ఓ మహిళ అకౌంట్లో ఏకంగా రూ.6 కోట్లు జమ కావడంతో ఆమె మైమరిచిపోయింది. ముందువెనుకా ఆలోచించకుండా ఆ డబ్బు దేవుడిచ్చాడనుకుని నచ్చచెప్పుకుంది. ఆ తరువాత ఆ డబ్బుతో రెచ్చిపోయిన ఆమెకు చివరకు భారీ షాకే తగిలింది. ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.
సుమారు ఐదేళ్ల క్రితం సిబాంగిలే మానీ జీవితంలో ఊహించని ఘటన జరిగింది. అప్పట్లో ఆమె వాల్టర్ సిసులూ యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో పొరపాటున ఆమె అకౌంట్లో రూ.6 కోట్లు జమయ్యాయి. దీంతో, ఉబ్బితబ్బిబ్బైపోయిన యువతి ఆ డబ్బుతో రెచ్చిపోయింది. తనకు ఇష్టమైన దుస్తులు, వస్తువుల, స్నేహితులకు పార్టీల పేరిట ఇష్టారీతిన ఖర్చు చేసింది. తన స్నేహితుల్లో అనేక మందికి ఖరీదైన బహుమతులు కూడా ఇచ్చింది. డబ్బులు విచ్చలివిడిగా ఖర్చు చేసింది. ఐఫోన్ లు, ఖరీదైన లిక్కర్ బాటిళ్లు కొనుగోలు చేసింది. ముందూ వెనకా ఇలా రెచ్చిపోవడంతో కొద్ది రోజుల్లోనే ఆమెకు భారీ షాక్ తగిలింది. ఓ సూపర్ మార్కెట్ లో ఆమె వదిలివెళ్లిన బిల్లు ఆధారంగా పోలీసులు యువతిని అరెస్టు చేశారు. దొంగతనం, మోసం తదితర నేరాలు మోపి జైలు పాలు చేశారు (South African Woman Splurges Money After Rs 6 Crore Gets Accidentally Deposited To Her Account).
Viral: భారత యువతిని పబ్లిక్‌గా ఆ డ్రెస్‌లో చూసి.. జపాన్ యువత షాక్!
2017లో ఆమె అరెస్టవగా 2022లో ఆమెకు న్యాయస్థానం ఐదేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. కానీ ఆమె తరుపు న్యాయవాది మాత్రం పట్టువిడవకుండా పోరాడారు. ఆమె దొంగతనం, మోసం చేయలేదని వాదించారు. తనంతట తానుగా ఆ డబ్బును ఆమె తీసుకోలేదని అన్నారు. పొరపాటున వచ్చిన డబ్బును దేవుడి బహుమతిగా భావించి ఖర్చుచేసిందని వాదించారు. దేవుడిచ్చాడని బలంగా నమ్మింది కాబట్టే ఆమె ముందూ వెనుకా అలా ఆలోచించకుండా ఖర్చు చేసిందని చెప్పారు. అదృష్టవశాత్తూ లాయర్ వాదనతో న్యాయస్థానం అంగీకరించడంతో గతేడాది ఆమె శిక్షను రద్దు చేసింది. అంత మొత్తం ఖర్చు పెట్టినా కూడా ఆమెను డబ్బు బ్యాంకుకు చెల్లించమని కోర్డు ఆదేశించలేదు. దీంతో, చావు తప్పి కన్నులొట్టపోయిన చందంగా ఆమె బతుకు జీవుడా అంటూ జైలు నుంచి బయటపడింది.