Krishna Janmashtami 2024: కృష్ణాష్టమి సందర్భంగా గోపాలుడుని ఎలా పూజించాలి.. ఏ సమయంలో పూజ చేయాలి..?
ABN , Publish Date - Aug 25 , 2024 | 09:57 PM
శ్రీ కృష్ణ భగవానుడి జన్మదినాన్ని శ్రీ కృష్ణ జన్మాష్టమిగా జరుపుకుంటారు. హిందూ మతంలో శ్రీ కృష్ణ జన్మాష్టమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున శ్రీ కృష్ణుడు కంస కారాగారంలో అర్ధరాత్రి జన్మించాడు.
శ్రీ కృష్ణ భగవానుడి జన్మదినాన్ని శ్రీ కృష్ణ జన్మాష్టమిగా జరుపుకుంటారు. హిందూ మతంలో శ్రీ కృష్ణ జన్మాష్టమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున శ్రీ కృష్ణుడు కంస కారాగారంలో అర్ధరాత్రి జన్మించాడు. అదే రోజు రాత్రి శ్రీ కృష్ణుడి తండ్రి వాసుదేవ్ అతన్ని గోకుల్‌లో విడిచిపెట్టాడు. అందుకే జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుని బాల రూపాన్ని పూజించడంతో పాటు ఉపవాసం కూడా పాటిస్తారు. ఈ రోజున శ్రీ కృష్ణుని బాల రూపాన్ని అంటే లడ్డూ గోపాలుడిని పూజించడం ద్వారా జీవితంలోని దుఃఖాల నుండి విముక్తి లభిస్తుందని, కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. వైదిక క్యాలెండర్ ప్రకారం భాద్రపద మాసంలోని కృష్ణ పక్ష అష్టమి ఈ ఏడాది 25 ఆగస్టు ఆదివారం సాయంత్రం 06.09 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే 26 ఆగస్టు సోమవారం సాయంత్రం 04.49 గంటలకు ముగుస్తుంది. ఈ సంవత్సరం జన్మాష్టమి నాడు చంద్రుడు వృషభరాశిలో ఉండటం వల్ల జయంతి యోగం ఏర్పడుతుంది. ఈ శుభ సమయంలో పూజ చేయడం ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. జన్మాష్టమి ఆగస్టు 26వ తేదీ ఉదయం 12.01 గంటల నుండి 12.45 గంటల వరకు ఉంటుంది. అంటే ఈ 45 నిమిషాల సమయంలో భక్తులు పూజ చేసుకోవడానికి అనువైన సమయం.
పూజకు కావల్సినవి..
పూజ కోసం ఒక పీఠను సిద్ధం చేసుకోవాలి. ఎరుపు లేదా పసుపు వస్త్రం తీసుకోవాలి. పూజకోసం పళ్లెం, ఒత్తులు, దీపం, నూనె, అగరబత్తి, కర్పూరం, ధూపం వేయడానికి సాంబ్రాణి, పువ్వులు, తులసి ఆకులు, అరటి ఆకులు, తమలపాకులు, లడ్డూలు, స్థోమతను బట్టి పండ్లు, స్వీట్లు పూజలో పెట్టుకోవచ్చు. పెరుగు, వెన్న, పంచదార రెడీ చేసుకోవాలి. పెరుగు, పాలు, నెయ్యి, తేనే, పంచదార కలిపి పంచామృతాన్ని తయారుచేసుకుని పెట్టుకోవాలి. గోపాలుడిని అలంకరించుకోవడం కోసం మనకు అందుబాటులో ఉన్న వస్తువులను ఉపయోగించవచ్చు. చెవిపోగులు, తలపాగా, గాజులు, దండ, తిలకం, నెమలి ఈకలు మొదలైనవాటితో గోపాలుడిని అలంకరించుకోవచ్చు.
పూజ ఎలా చేసుకోవాలి
కృష్ణ జన్మాష్టమి నాడు, మక్కన్ మిశ్రిని తప్పనిసరిగా కృష్ణుడికి నైవేద్యంగా పెడతారు. ఈ పదార్థం పెట్టడం వల్ల శ్రీకృష్ణుడు చాలా సంతోషిస్తాడని, అన్ని కోరికలు నెరవేరుస్తాడని భక్తుల ప్రగాడ విశ్వాసం. కృష్ణ జన్మాష్టమి రోజున తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి శ్రీకృష్ణుని ఆలయానికి వెళ్లి అక్కడ నెమలి ఈకలను సమర్పించాలి. ఇంట్లో కూడా శ్రీకృష్ణుడి పటం వద్ద నెమలి ఈకలను పెట్టొచ్చు. శ్రీకృష్ణుని విగ్రహాన్ని అలంకరించుకోవాలి. గోపాలుడికి ఊయల సిద్ధం చేయాలి. పూజ సమయంలో శ్రీకృష్ణుని మంత్రాన్ని 108 సార్లు జపించాలి. పూజకు ముందు మళ్లీ స్నానం చేయాలి. శుభ్రమైన బట్టలు ధరించి పూజకు సిద్ధం కావాలి. ఆ తర్వాత శ్రీకృష్ణుని విగ్రహానికి దక్షిణావర్తి శంఖంతో అభిషేకం చేసి పూలు, పండ్లు సమర్పించాలి. వివిధ రకాల వంటకాలను నైవేద్యంగా సమర్పించాలి. జన్మాష్టమి కథను విని చివరలో శ్రీకృష్ణుడికి హారతి ఇవ్వాలి.
పూజ ప్రాముఖ్యత..
కృష్ణ జన్మాష్టమి రోజున ఉపవాసం ఉండడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. సంతానం పొందాలనుకునే దంపతులు జన్మాష్టమి రోజున లడ్డూ గోపాల్‌ని పూజిస్తే ఫలితం దక్కుతుందని భక్తుల విశ్వాసం. జన్మాష్టమి నాడు ఉపవాసం ఉండటం వల్ల భక్తుల జీవితంలోని కష్టాలు తొలగిపోయి సంపద పెరుగుతుంది.
Sri Krishna Janmashtami: రేపే శ్రీకృష్ణ జన్మాష్టమి.. ఏం తినాలి, ఏం తినకూడదంటే..
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Telugu Latest News Click Here