Viral Video: తెలివి ఉండాలే గానీ, కారే కావాలా, ఏంటి? వీళ్లు తయారు చేసిన స్కూటర్ చూస్తే నివ్వెరపోవాల్సిందే..
ABN , Publish Date - Sep 06 , 2024 | 07:15 PM
ముగ్గురు, నలుగురు స్నేహితులు కలిసి బయటకు వెళ్లాలంటే కారు ఉండాల్సిందే. అయితే కారు కొనే స్థోమత అందరి దగ్గరా ఉండదు. అందుకే కొందరు వ్యక్తులు ఓ వెరైటీ ఆలోచన చేశారు. స్కూటర్‌నే సాగదీసి కారులా మార్చేశారు. ఆ స్కూటర్‌పై చక్కగా ముగ్గురు కలిసి ప్రయాణించారు.
ముగ్గురు, నలుగురు స్నేహితులు కలిసి బయటకు వెళ్లాలంటే కారు (Car) ఉండాల్సిందే. అయితే కారు కొనే స్థోమత అందరి దగ్గరా ఉండదు. అందుకే కొందరు వ్యక్తులు ఓ వెరైటీ ఆలోచన చేశారు. స్కూటర్‌నే సాగదీసి కారులా మార్చేశారు. ఆ స్కూటర్‌పై చక్కగా ముగ్గురు కలిసి ప్రయాణించారు. ఆ వెరైటీ ఈవీ స్కూటర్‌కు (EV Scooter) సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. amazingtaishun అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియో చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు (Viral Video).
వైరల్ అవుతున్న ఆ వీడియోలో ముగ్గురు అబ్బాయిలు పొడవాటి స్కూటర్‌పై కూర్చుని రోడ్డుపై చక్కగా ప్రయాణిస్తున్నారు. ఈ స్కూటర్ సాధారణ స్కూటర్ కంటే చాలా పొడవుగా ఉంటుంది. సులభంగా నలుగురు కూర్చుని ప్రయాణించేందుకు వీలుగా ఉంది. ఇందులో వెనుక కూర్చున్న వ్యక్తి స్కూటర్ సీటుపై కూర్చున్నాడు. ముందు కూర్చున్న ఇద్దరూ ప్లాస్టిక్ స్టూల్స్ వేసుకుని కూర్చున్నారు. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి కూడా ప్లాస్టిక్ స్టూల్ పైనే కూర్చున్నాడు. దీనిని చూస్తుంటే రెండు స్కూటర్‌లు కలిసి ఒక స్కూటర్‌గా తయారైనట్లు అనిపిస్తుంది. అయితే నిజానికి ఆ స్కూటర్ మధ్యలో ఇనుప ప్లాట్‌ఫామ్‌ను వెల్డింగ్ ద్వారా జాయింట్ చేశారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. దాదాపు 3.3 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``స్పీడ్ బ్రేకర్ వస్తే ఈ స్కూటర్ పరిస్థితి ఏంటి``, ``ఎవరి సీటు వారే తెచ్చుకోవాలి``, ``ఇది సోషల్ డిస్టెన్స్ స్కూటర్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: అయ్యో.. పాపం.. ఈ మందు బాబుకు ఎంతో కష్టం వచ్చింది.. చెప్పు కూడా అతడికి అందడం లేదే..
Viral Video: అందమే కాదు.. ధైర్యం కూడా ఈమె సొత్తే.. భారీ సర్పాన్ని పట్టుకుని ఈమె ఏం చేసిందో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి