Share News

Viral: టీచర్‌కు షాకిచ్చిన స్టూడెంట్.. ఈ కుర్రాడు అడిగిన ప్రశ్నకు మీరైనా సరైన సమాధానం చెప్పండి..!

ABN , Publish Date - May 10 , 2024 | 02:52 PM

పరీక్షల సీజన్ ముగిసింది. చాలా చోట్ల పరీక్షల ఫలితాలు కూడా విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో జవాబు పత్రాల్లో విద్యార్థులు రాసిన ఫన్నీ సమాధానాలు బాగా వైరల్ అయ్యాయి. అలాగే పాస్ కావడానికి కొందరు విద్యార్థులు చేసిన ప్రయత్నాలకు సంబంధించిన ఉదంతాలు కూడా నెట్టింట హల్‌చల్ చేశాయి.

Viral: టీచర్‌కు షాకిచ్చిన స్టూడెంట్.. ఈ కుర్రాడు అడిగిన ప్రశ్నకు మీరైనా సరైన సమాధానం చెప్పండి..!
Screen Shot

పరీక్షల (Exams) సీజన్ ముగిసింది. చాలా చోట్ల పరీక్షల ఫలితాలు కూడా విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో జవాబు పత్రాల్లో విద్యార్థులు (Student) రాసిన ఫన్నీ సమాధానాలు బాగా వైరల్ అయ్యాయి. అలాగే పాస్ కావడానికి కొందరు విద్యార్థులు చేసిన ప్రయత్నాలకు సంబంధించిన ఉదంతాలు కూడా నెట్టింట హల్‌చల్ చేశాయి. అయితే ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వాట్సాప్ స్క్రీన్ షాట్ వైరల్ అవుతోంది. ఓ ఇంగ్లీష్ టీచర్‌ (Teacher)ను అతడి స్టూడెంట్ అడిగిన ఓ ప్రశ్న చాలా మందిని ఆయోమయానికి గురి చేస్తోంది (Viral News).


ఆ స్క్రీన్ షాట్‌లో ఒక బాలుడు తన ఇంగ్లీష్ టీచర్‌ని, ``సార్, మీరు ఇంగ్లీషు బాగా వచ్చా`` అని అడిగాడు. అందుకు టీచర్ ``అవును, సందేహం లేదు`` అని సమాధానమిచ్చారు. అయితే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండని స్టూడెంట్ అడగ్గానే.. టీచర్ సరే అన్నారు. దాంతో ఆ బాలుడు ``A mother beats up her daughter because she was drunk, Tell me Who was Drunk`` అని అడిగాడు. గ్రామర్ పరంగా కాస్త కష్టంగా ఉన్న ప్రశ్న ఆ ఇంగ్లీష్ టీచర్‌నే చాలా మందిని అయోమయానికి గురి చేస్తోంది.


ఆ వాట్సాప్ స్క్రీన్ షాట్ funnychats51 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ అయింది. కోటి మందికి పైగా ఈ పోస్ట్‌ను వీక్షించారు. 18 లక్షల మందికి పైగా లైక్ చేశారు. చాలా మంది ఈ ప్రశ్నకు రకరకాల సమాధానాలు ఇచ్చారు. కొందరు ``కూతురు`` అని, మరికొందరు ``తల్లి`` అని కామెంట్లు చేశారు. ``అది ఫ్యామిలీ మేటర్, మనం దూరంగా ఉండాలి`` అని ఒకరు కామెంట్ చేశారు. మరి, ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏంటో మీరు కూడా ఊహించండి.

ఇవి కూడా చదవండి..

Viral: పెళ్లికి ముందు కాస్ట్లీ గిఫ్ట్‌గా ఎంగేజ్‌మెంట్ రింగ్.. పెళ్లి తర్వాత అసలు విషయం తెలుసుకుని భార్య షాక్!


Viral: బీర్‌లపై ఆసక్తి అతడిని లక్షాధికారిని చేసింది.. బ్రిటన్‌కు చెందిన ఆ వ్యక్తి కథేంటంటే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 10 , 2024 | 02:52 PM