Share News

Viral Video: ఈ స్టూడెంట్ చాలా రొమాంటిక్‌.. పరీక్ష పేపర్ దిద్దిన టీచర్‌కు 440 వాట్స్ షాక్.. నవ్వాపుకోవడం కష్టం!

ABN , Publish Date - Jun 22 , 2024 | 10:23 AM

ప్రేమలో ఉన్న ప్రతి వ్యక్తి తన హృదయాన్ని తమ ప్రియమైన వారితో నింపేసుకుంటారు. గుండెల నిండా నువ్వే ఉన్నావంటూ ప్రియమైన వారికి చెబుతుంటారు. అయితే ఓ కుర్రాడు ఆ విషయాన్ని ఏకంగా పరీక్ష పేపర్లోనే రాశాడు. తన గుండెలోని ఐదు భాగాలను ఐదుగురు అమ్మాయిలకు కేటాయించాడు.

Viral Video: ఈ స్టూడెంట్ చాలా రొమాంటిక్‌.. పరీక్ష పేపర్ దిద్దిన టీచర్‌కు 440 వాట్స్ షాక్.. నవ్వాపుకోవడం కష్టం!
Heart Diagram

ప్రేమలో ఉన్న ప్రతి వ్యక్తి తన హృదయాన్ని (Heart) తమ ప్రియమైన వారితో నింపేసుకుంటారు. గుండెల నిండా నువ్వే ఉన్నావంటూ ప్రియమైన వారికి చెబుతుంటారు. అయితే ఓ కుర్రాడు (Student) ఆ విషయాన్ని ఏకంగా పరీక్ష పేపర్లోనే (Exam Paper) రాశాడు. తన గుండెలోని ఐదు భాగాలను ఐదుగురు అమ్మాయిలకు (Girls) కేటాయించాడు. ఆస్తి పంపిణీ చేసినట్టు తన హృదయంలోని ఐదు భాగాలను ఐదుగురు అమ్మాయిలకు పంచేశాడు. ఆ విషయాన్ని బొమ్మతో సహా గీసి చక్కగా వివరించాడు. ఆ పేపర్ దిద్దిన టీచర్ షాక్‌కు గురయ్యారు. ఆ పేపర్‌ను ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు (Viral Video).


memes_connection అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆ వీడియో షేర్ అయింది. పరీక్ష పేపర్‌లో ``గుండె చిత్రాన్ని గీసి దానిలోని భాగాలను, విధులను గుర్తించండి`` అనే ప్రశ్న ఇచ్చారు. ఆ ప్రశ్నకు ఓ కుర్రాడు తనదైన శైలిలో సమాధానం రాశాడు. ఆ కుర్రాడు హృదయం బొమ్మను (Heart Diagram) గీసి ఐదు భాగాలను గుర్తించాడు. వాటిల్లో ప్రియ, రూప, హరిత, పూజ, నమిత ఉన్నట్టు పేర్కొన్నాడు. అంతేకాదు ఆ అమ్మాయిల గురించి చక్కగా వివరించాడు. ప్రియ అనే అమ్మాయి తనతో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఛాటింగ్ చేస్తుందని, ఆ అమ్మాయి అంటే తనకు ఇష్టమని పేర్కొన్నాడు.


ఇక, రూప తనతో స్నాప్ ఛాట్ ద్వారా మెసేజ్‌లు చేస్తుందని, చాలా అందంగా ఉంటుందని తెలిపాడు. ఇక, నమిత తన పొరుగింట్లో ఉంటుందని, ఆమె జుత్తు పొడవుగా, కళ్లు పెద్దగా ఉంటాయని రాశాడు. ఇక, పూజ తన మాజీ ప్రేయసి అని ఆమెను మర్చిపోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక, చివరగా హరిత తన క్లాస్‌మేట్ అని పేర్కొన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కోట్ల మంది ఈ వీడియోను వీక్షించారు. 10 లక్షల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ కుర్రాడి జవాబు చూసిన వారు నవ్వాపుకోలేకపోతున్నారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: వామ్మో.. ఎవర్రా మీరంతా.. ప్రాణాలంటే లెక్క లేదా? రీల్ కోసం ఓ అమ్మాయి ఏం చేసిందో చూడండి..


Optical Illusion: మీ కళ్ల సామర్థ్యాన్ని పరీక్షించుకోండి.. ``R``ల మధ్య దాక్కున్న రెండు ``B``లను వెతకండి..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 22 , 2024 | 10:23 AM