Fasting: ఉపవాసం చేస్తున్నారా.. శరీరంలో జరిగే మార్పులపై కీలక అధ్యయనం
ABN , Publish Date - Mar 04 , 2024 | 09:50 AM
పండగల సమయాల్లో సాధారణంగా చాలా మంది ఉపవాసం ఉంటారు. ఆ సమయంలో శరీరం చాలా నీరసంగా మారుతుంది. కొందరికి విపరీతంగా ఆకలి వేసి.. ఏమీ తినకపోయేసరికి ఆకలి వేయదు. అయితే ఉపవాసం చేపట్టాక శరీరంలో జరిగే మార్పుల గురించి ఓ ఆసక్తికర అధ్యయనం వెలువడింది.
లండన్: పండగల సమయాల్లో సాధారణంగా చాలా మంది ఉపవాసం ఉంటారు. ఆ సమయంలో శరీరం చాలా నీరసంగా మారుతుంది. కొందరికి విపరీతంగా ఆకలి వేసి.. ఏమీ తినకపోయేసరికి ఆకలి వేయదు. అయితే ఉపవాసం చేపట్టాక శరీరంలో జరిగే మార్పుల గురించి ఓ ఆసక్తికర అధ్యయనం వెలువడింది. లండన్‌లోని క్వీన్ మేరీ యూనివర్శిటీ, నార్వేజియన్ స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ సైన్సెస్ శాస్త్రవేత్తలు అధ్యయనం నిర్వహించి నేచర్ మెటబాలిజం జర్నల్‌ని ప్రచురించారు.
దీని ప్రకారం.. ఎక్కువ కాలం ఉపవాసం ఉన్న వారి శరీరంలోని వివిధ అవయవాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తరచూ అనారోగ్యం బారిన పడే రోగులు ఉపవాసం ఉండటం మంచిది కాదు. ఏడు రోజులపాటు నీరు మాత్రమే తీసుకుంటూ ఉపవాసం ఉన్న 12 మంది ఆరోగ్యవంతులపై ఈ రిసర్చ్ జరిపారు. క్వీన్ మేరీస్ ప్రెసిషన్ హెల్త్ యూనివర్శిటీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ క్లాడియా లాంగెన్‌బర్గ్ మాట్లాడుతూ.. బరువు తగ్గడానికి ఉపవాసం పని చేస్తుందన్నారు. అంతకుమించిన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉపవాసంతో జరుగుతాయన్నారు.