Summer Coolers: వేసవి వచ్చేస్తోంది.. ఇంట్లోనే ఇలా ఈజీగా కూలర్ రెడీ చేసుకోండి..
ABN , Publish Date - Feb 29 , 2024 | 02:35 PM
Summer Air Cooler: వేసవి కాలం వచ్చేస్తోంది. తమ ఇంటిని కూల్‌గా ఉంచుకునేందుకు ప్రజలు ఇప్పటి నుంచే చర్యలు చేపడుతున్నారు. అధిక ఉష్ణోగ్రతల(Summer Temperature) నుంచి ఉపశమనం పొందడానికి కొందరు ఏసీ(Air Conditioner)లను కొనుగోలు చేస్తుంటే.. మరికొందరు కూలర్(Cooler) కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, కూలర్, ఏసీ కొనుగోలు చేయలేని వారు..
Summer Air Cooler: వేసవి కాలం వచ్చేస్తోంది. తమ ఇంటిని కూల్‌గా ఉంచుకునేందుకు ప్రజలు ఇప్పటి నుంచే చర్యలు చేపడుతున్నారు. అధిక ఉష్ణోగ్రతల(Summer Temperature) నుంచి ఉపశమనం పొందడానికి కొందరు ఏసీ(Air Conditioner)లను కొనుగోలు చేస్తుంటే.. మరికొందరు కూలర్(Cooler) కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, కూలర్, ఏసీ కొనుగోలు చేయలేని వారు చాలా మంది ఉంటారు. అలాంటి వారి కోసమే అదిరిపోయే ట్రిక్ చెప్పబోతున్నాం.
ఒక్కొక్కసారి పనికిరాని వస్తువు అని పడేసేవి కూడా మనకు ఉపయోగపడుతుంటాయి. అలాంటి పనికిరాని వస్తువుతోనే.. వేసవిలో చల్లటి గాలినిచ్చే కూలర్‌ను ఎలా తయారు చేయాలో ఇవాళ మనం తెలుసుకుందాం. అవును, చాలా మంది ఇళ్లలో నిరుపయోగమైన ప్లాస్టిక్ డ్రమ్స్ ఉంటాయి. జస్ట్ దానికి ఒక టేబుల్ ఫ్యాన్ తగిలిస్తే చాలు.. చల్ల చల్లని గాలినిచ్చే కూలర్ రెడీ అవుతుంది. పైసా ఖర్చు లేకుండా దీనిని ఇంట్లోనే సిద్ధం చేసుకోవచ్చు.
కూలర్ తయారీ కోసం ఇవి కావాలి..
చిన్న ప్లాస్టిక్ డ్రమ్ తీసుకోండి. ఒక కుషన్ నెట్, ఈ నెట్‌ను సెట్ చేయడానికి ఒక ఇనుప తీగ తీసుకోవాలి. చిన్న ఫ్యాన్, నీటిని పంప్ చేయడానికి ఒక చిన్న మోటారు తీసుకోవాలి. ఫ్యాన్, వాటర్ సప్లయ్ మోటర్ మినహా మిగతా వస్తువులన్నీ ఇంట్లోనే లభిస్తాయి. వీటిని కొనుగోలు చేయడానికి రూ. 1000 కంటే తక్కువ ఖర్చు అవుతుంది.
మినీ కూలర్ ఎలా చేయాలంటే..
ముందుగా ఒక చిన్న ప్లాస్టిక్ డ్రమ్ తీసుకోవాలి. ఒకవైపు ఫ్యాన్ సైజ్ ఆకారంలో రౌండ్‌గా ఆ డ్రమ్‌ను కట్ చేయాలి. మరో వైపు కుషన్ నెట్‌కు సరిపోయేలా కట్ చేయాలి. ఆ తరువాత.. డ్రమ్‌లో ఫ్యాన్ ఫిక్స్ చేయాలి. మరోవైపు ఇనుప తీగ సహాయంతో కుషన్ నెట్‌ను సెట్ చేయాలి. డ్రమ్ పైన మూత ఏర్పాటు చేసి.. నీటిని పోసేందుకు ఆ మూతకు ఒక రంద్రం ఏర్పాటు చేయాలి. డ్రమ్ లోపల నీటిని సరఫరా చేసే మోటారును అమర్చాలి. అందులో ఒక పైపు ఏర్పాటు చేయాలి. దీనికి వైరింగ్ సెట్ చేసి.. ఆన్ చేస్తే.. దేశీ కూలర్ రెడీ అవుతుంది. చీప్ అండ్ బెస్ట్‌గా.. వేసవిలో కూల్‌గా ఉండొచ్చు.
మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..