Summer Tan: వేసవిలో టానింగ్ కి చెక్ పెట్టే చిట్కా.. ముల్తానీ మట్టిలో ఇదొక్కటి మిక్స్ చేసి వాడారంటే..!
ABN , Publish Date - Apr 17 , 2024 | 03:41 PM
ఎండల వల్ల శరీర చర్మం మీద టాన్ వస్తే దాన్ని ఇంటిపట్టునే ఈజీగా వదిలించుకోవచ్చు. దీనికోసం ముల్తానీ మట్టిలో కేవలం ఒకే ఒక పదార్థం కలిపి ఉపయోగిస్తే సరిపోతుంది.
వేసవికాలం అమ్మాయిలకు చాలా ఇబ్బందికరమైన కాలం. ఇంట్లో నుండి బయటకు వెళ్ళాలంటనే భయపడతారు. ఇక అందం గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకునే అమ్మాయిలు అయితే ఈ వేసవి ఎండల్లో బయటకు వెళ్తే తమ శరీర ఛాయ ఎక్కడ రంగు మారుతుందో అని భయపడతారు. కానీ బయటకు వెళ్లడం మాత్రం ఏదో ఒక సందర్భంలో తప్పని పని. ఎండల వల్ల శరీర చర్మం మీద టాన్ వస్తే దాన్ని ఇంటిపట్టునే ఈజీగా వదిలించుకోవచ్చు. దీనికోసం ముల్తానీ మట్టిలో కేవలం ఒకే ఒక పదార్థం కలిపి ఉపయోగిస్తే సరిపోతుంది. అదేంటో తెలుసుకుంటే..
ముల్తానీ మట్టి టానింగ్ ప్యాక్..
ముల్తానీ మట్టి, టమోటా టానింగ్ ప్యాక్ తో చర్మం మీద టానింగ్ ను ఈజీగా తొలగించుకోవచ్చు. ఒక స్పూన్ ముల్తానీ మట్టిలో సరిపడినంత టమోటా రసాన్ని వేసి కలపాలి. దీన్ని పేస్ట్ లాగా సిద్దం చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి, ప్యాక్ లా వేసుకోవాలి. టాన్ సమస్య మెడకు, పాదాలు, చేతులకు కూడా ఉంటే అక్కడ కూడా అప్లై చేయవచ్చు. 20 నుండి 25 నిమిషాల తరువాత కడిగేసుకోవాలి. టమోటాలో ఉండే లైకోపిన్ టానింగ్ ను తొలగించడంలో సహాయపడుతుంది. ఈ ప్యాక్ ను వారానికి రెండుసార్లు అప్లై చేయవచ్చు.
ఆడవాళ్లు పొరపాటున కూడా తినకూడని ఆహారాల లిస్ట్ ఇదీ..!
టానింగ్‌ను తొలగించడానికి ముల్తానీ మట్టిని ఇతర మార్గాల్లో అప్లై చేయవచ్చు. ముల్తానీ మట్టిని ఒక చెంచా తీసుకుని అందులో నిమ్మరసం కలపాలి. ఈ ఫేస్ ప్యాక్‌ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. విటమిన్ సి గుణాలు పుష్కలంగా ఉన్న ఈ ఫేస్ ప్యాక్ నలుపును తగ్గించి ముఖం కాంతివంతంగా మార్చుతుంది.
ముల్తానీ మట్టిని పెరుగుతో కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ చేయడానికి పెరుగు, ముల్తానీ మట్టిని సమాన పరిమాణంలో కలిపి ఫేస్ ప్యాక్ సిద్ధం చేసుకోవాలి. ముఖానికి ప్యాక్ వేసుకుని 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంచిన తర్వాత కడిగితే తొలగిపోతుంది.
బీపీ పెషెంట్లు ఈ ఒక్క విషయంలో జాగ్రత్త పడితే.. సేఫ్ గా ఉండొచ్చట!
టానింగ్ తగ్గించుకోవడానికి ముల్తానీ మట్టిని తేనెతో కలిపి ఫేస్ ప్యాక్ సిద్ధం చేసుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్‌ని వారానికి ఒకసారి అప్లై చేసుకోవచ్చు. ఒక చెంచా తేనె, ఒక చెంచా ముల్తానీ మట్టిని కలపాలి. ఈ ఫేస్ ప్యాక్‌ను ముఖంపై 15 నిమిషాల పాటు ఉంచాలి. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్న ఈ ఫేస్ ప్యాక్ ముఖంపై మంచి ప్రభావాన్ని చూపుతుంది.
ముఖానికి ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. దీని తర్వాత, ఫేస్ ప్యాక్‌ను మొత్తం ముఖంపై పూర్తిగా అప్లై చేయాలి. ఫేస్ ప్యాక్‌ని కళ్లకు చాలా దగ్గరగా వేయకూడదు. ఫేస్ ప్యాక్ ఆరిన తరువాత దాన్ని తొలగించాల్సిప్పుడు మొదట ముఖం మీద నీరు పోసి ఆపై తేలికగా రుద్దుతూ తొలగించాలి.
బీపీ పెషెంట్లు ఈ ఒక్క విషయంలో జాగ్రత్త పడితే.. సేఫ్ గా ఉండొచ్చట!
ఆడవాళ్లు పొరపాటున కూడా తినకూడని ఆహారాల లిస్ట్ ఇదీ..!
మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.