Share News

Surya Tilak: అయోధ్యలో జరిగిన సూర్య తిలకం వేడుక వెనుక ఇంత శాస్త్రీయత ఉందా?

ABN , Publish Date - Apr 19 , 2024 | 10:52 AM

శ్రీరాముని జన్మదినోత్సవం రోజున ఆ బాలరామునికి జరిగిన సూర్య తిలకం వేడుక మీద సర్వత్రా చర్చ నెలకొంది. అయితే దీని వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. సూర్యతిలకం వేడుక వెనుక ఉన్న నిజమిదే..

Surya Tilak: అయోధ్యలో జరిగిన సూర్య తిలకం వేడుక వెనుక ఇంత శాస్త్రీయత ఉందా?

అయోధ్య రామమందిరం నిర్మాణం నిర్ణయం వెలువడింది మొదలు రామమందిరం ప్రారంభం వరకు దేశమంతా బోలెడు చర్చ నడిచింది. అక్కడి వింతలు, విశేషాల గురించి సోషల్ మీడియా ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం అందిస్తూనే ఉంది. రామమందిరం ప్రారంభం తరువాత మళ్లీ శ్రీరామ నవమి సందర్బంగా రామమందిరం చర్చలలో నిలిచింది. శ్రీరాముని జన్మదినోత్సవం రోజున ఆ బాలరామునికి జరిగిన సూర్య తిలకం వేడుక మీద సర్వత్రా చర్చ నెలకొంది. అయితే దీని వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. సూర్యతిలకం వేడుక వెనుక ఉన్న రహస్యాలేంటో తెలుసుకుంటే..

30ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ తప్పక తీసుకోవలసిన 10 విటమిన్ల లిస్ట్ ఇదీ..!


అయోధ్య రామాలయంలో అత్యాధునిక శాస్త్రీయ నైపుణ్యాన్ని ఉపయోగించి 5.8సె.మీ కాంతి పుంజం సరిగ్గా బాలరాముడి నుదిటిమీద పడేలా ఏర్పాటు చేశారు. దీని కోసం ప్రత్యేక పరికరాన్నికూడా ఏర్పాటు చేశారు. రామమందిర నిర్మాణంలో పాలుపంచుకున్న పదిమంది శాస్త్రవేత్తలు ఈ వేడుకను విజయవంతం చేశారు. శ్రీరామ నవమి రోజు మద్యాహ్నం 12 గంటల నుండి దాదాపు 3నుండి 3.5 నిమిషాల వరకు అద్దాలు, లెన్స్ ల ను ఉపయోగించి సూర్యకాంతి ఖచ్చితంగా బాలరాముడి నుదిటిమీద తాకింది. దీని కోసం ఏర్పాటు చేసిన పరికరాన్ని సూర్య తిలక్ మెకానిజం అని పిలుస్తారు. ఈ సూర్యతిలకం ద్వారా నేరుగా బాల రాముడికి సూర్యకిరణాలతో అభిషేకం జరుగుతుంది. ఇలాంటి సూర్యతిలక్ యంత్రాలు కొన్ని జైన దేవాలయాల్లోనూ, కోణార్క్ లోని సూర్యదేవాయలయంలోనూ ఉన్నాయి. కాకపోతే వీటిని వేరుగా రూపొందించారు.

పిల్లలకు పొరపాటున కూడా తల్లిదండ్రులు చెప్పకూడని 8విషయాలు ఇవీ..!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Apr 19 , 2024 | 10:52 AM