Share News

Viral: సొంత ఇల్లు బెటరా? అద్దె ఇల్లు బెటరా? డిబేట్‌పై నెటిజన్ల నిర్ణయం ఇదే!

ABN , Publish Date - Aug 10 , 2024 | 08:01 PM

సొంతింటి కల వల్లే మధ్యతరగతి ప్రజలు ఎదగలేకపోతున్నారంటూ ఓ వ్యక్తి చేసిన పోస్టుపై నెట్టింట పెనుదుమారమే రేగింది. అద్దె ఇళ్లు బెటరని చెప్పే ఇలాంటి వాళ్లు సీక్రెట్ గా ఇళ్లు కొనుగోలు చేస్తారని మండిపడ్డారు. సొంత ఇల్లు ఆత్మగౌరవానికి ప్రతీక అని అభిప్రాయపడ్డారు. c

Viral: సొంత ఇల్లు బెటరా? అద్దె ఇల్లు బెటరా? డిబేట్‌పై నెటిజన్ల నిర్ణయం ఇదే!
Own House Vs Rented House debate

ఇంటర్నెట్ డెస్క్: తన కంటూ ఓ సొంత గూడు ఏర్పాటు చేసుకోవాలనేది ప్రతి మధ్యతరగతి వ్యక్తి కల. జీవితకాలం పాటు కష్టపడి కొందరు సొంత ఇల్లు కొనుక్కుంటే మరికొందరికి అది కలగానే మిగిలిపోతుంది. అయితే, అసలు సొంత ఇల్లు అవసరమా? కాదా? అనే చర్చ ఎప్పటినుంచో కొనసాగుతూనే ఉంది. ఇళ్ల రేట్లు ఆకాశాన్నంటుతున్న నేటి జమానాలో అనేక మంది అద్దె ఇళ్లే బెటరనే అంచనాకు వస్తున్నారు. నచ్చిన ఇంట్లో ఉండొచ్చు.. వద్దనుకుంటే వెళ్లిపోవచ్చు.. అనే స్వేచ్ఛ ఉంటుందని వాదిస్తున్నారు. అయితే, అద్దె ఇల్లే బెటరంటూ ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ చేసిన వాదనతో మాత్రం అధిక శాతం ఏకీభవించలేదు. ప్రజలను తప్పుదారి పట్టించే ఇలాంటి వాళ్లను నమ్మొద్దని కూడా హెచ్చరించారు (Viral).

Viral Video: ప్రాణభయం పొంచి ఉన్నా అదే పరుగు.. మొసలి నోటి నుంచి తాబేలు ఎలా తప్పించుకుందో చూడండి..


అద్దె ఇళ్లే బెటరంటూ ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ పెట్టిన పోస్టు నెట్టింట పెద్ద చర్చకే దారి తీసింది. ‘‘50 ఏళ్లగా మధ్య తరగతి ప్రజలు సొంతింటి కల కంటున్నారు. ఇప్పటికే మిడిల్ క్లాస్ ప్రజల తొలి లక్ష్యం సొంత ఇల్లే. ఈ కారణంగానే అనేక వారు మధ్య తరగతిలో మిగిలిపోతున్నారు’’ అంటూ అతడు పోస్టు పెట్టాడు. ఆర్థికాభివృద్ధి అధికంగా ఉండే లక్ష్యాలవైపు మిడిల్ క్లాస్ జనాలు మళ్లట్లేదని చెప్పుకొచ్చాడు (Tech CEO Slams Investor Who Says Renting A House Is Better Than Buying).


దీనిపై నెట్టింట పెను దుమారమే రేగింది. ఈ అభిప్రాయం వ్యక్తం చేసినందుకు అనేక మంది తిట్టిపోశారు. సొంత ఇల్లును కేవలం పెట్టుబడిగా కాక ఆత్మాభిమానానికి ప్రతీకగా చూడాలని కొందరు అన్నారు. పది శాతం అద్దె పెంచనందుకు ఇళ్లు ఖాళీ చేయాలంటూ ఓనర్లు హుకుం జారీ చేయడకంటే అవమానకర పరిస్థితి ఇంకేమైనా ఉంటుందా అని ప్రశ్నించారు. ఇలాంటి సూచనలు ఇచ్చే ఇన్వెస్టర్లు రహస్యంగా సొంతిళ్లు కొనుగోలు చేస్తారని కొందరు మండిపడ్డారు. వీళ్ల సూచనలను అస్సలు నమ్మకూడదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో వైరల్‌గా మారింది. సొంతింటికే జనాలు జైకొట్టేలా చేసింది.

Read Viral and Telugu News

Updated Date - Aug 10 , 2024 | 08:01 PM