Share News

Viral News: సోమశిల టు శ్రీశైలం బోటు ప్రయాణం..

ABN , Publish Date - Nov 04 , 2024 | 06:45 PM

నిత్యం ఉరుకుల పరుగుల జీవితం నుంచి ప్రజలకు కాసేపు ఉపశమనం కలిగించేందుకు తెలంగాణ పర్యాటక శాఖ చర్యలు చేపట్టింది. అందులోభాగంగా సోమశిల నుంచి శ్రీశైలం, అలాగే నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలంకు క్రూయిజ్ సర్వీసులు ప్రారంభించింది.

Viral News: సోమశిల టు శ్రీశైలం బోటు ప్రయాణం..

నిత్యం ఉరుకులు పరుగుల జీవితం. దీనికి తోడు ట్రాఫిక్ కష్టాలు. ఎక్కడైనా కాసేపు సేద తీరదామంటే.. కుదరని పని. పుణ్యం. పురుషార్థం కోసం ఎక్కడికైనా వెళ్దామా అంటే.. రైలు, విమానాలు, బస్సు ఇలా అన్నింటిలో సీట్లు, బర్త్‌లు ఫుల్. ఖాళీలు నిల్. అలాంటి వేళ.. ఇటువంటి వారి కోసం తెలంగాణ పర్యాటక శాఖ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం. అటు సోమశిల నుంచి శ్రీశైలం.. రెండు రివర్ కమ్ రోడ్డు ట్రిప్పులను ఏర్పాటు చేసింది.

TG Politics: అమరవీరుల స్తూపం వద్దకు వస్తారా? గంగాపురం, బండికి పొన్నం సవాల్


పర్యాటకులకు అలలపై ప్రయాణం సాగిస్తూ.. ప్రకృతిని ఆస్వాదించేలా తెలంగాణ పర్యాటక శాఖ ఈ రెండు ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. అందులో ఒకటి శ్రీశైలం నుంచి సోమశిలకు లాంచీ ప్రయాణం. మరొకటి నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు. అయితే ఈ ప్రయాణంలో సోమశిల నుంచి లాంచి ప్రయాణం ప్రారంభమవుతుంది. ఈ సోమశిలలో సోమేశ్వరుడు కొలువు తీరారు. ఆయన్ని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది సోమశిలకు తరలి వస్తారు. చుట్టు నీరు, కొండలతో ప్రకృతి రమణీయత ఉట్టిపడుతుంది. ఈ ప్రాంతాన్ని సప్తనది సంగమం అని కూడా పిలుస్తారు. కృష్ణానది ఒడ్డున ఉన్న ఈ గ్రామం నుంచి శ్రీశైలానికి ప్రత్యేకంగా రివర్ కమ్ రోడ్డు ట్రిప్‌ను ఏర్పాటు చేసింది. వారంతంలో ఏర్పాటు చేసిన ఈ ట్రిప్ అందరిని ఆకట్టుకునేలా తీర్చిదిద్దింది తెలంగాణ పర్యాటక శాఖ.

Also Read: కోడెల విగ్రహంపై మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు


సోమశిల - శ్రీశైలం మధ్య దూరం 120 కిలోమీటర్లు. సోమశిల నుంచి శ్రీశైలం చేరడానికి 6 గంటల సమయం పడుతుంది. ప్రతి శని, ఆదివారాల్లో తెలంగాణ పర్యాటక శాఖ బోట్ సింగిల్ ట్రిప్‌ను నవంబర్ 2వ తేదీన ప్రారంభించింది. ఉదయం 10.00 గంటలకు ఈ బోట్ ప్రయాణం ప్రారంభమవుతుంది. సాయంత్రం 4.00 లేదా 4.30 గంటలకు శ్రీశైలం సమీపంలోని ఈగల పెంట గ్రామానికి ఈ బోట్ చేరుతుంది. ఈగల పెంట నుంచి శ్రీశైలానికి 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడి నుంచి ప్రయాణికులు రహదారి మార్గంలో శ్రీశైలానికి చేరుకోవాల్సి ఉంటుంది.

Also Read: AP Politics: జగన్‌కి జోగి ఝలక్..!


అయితే గతంలో రెండు వైపులా ప్రయాణం సాగేది. అంటే సోమశిల నుంచి శ్రీశైలం వెళ్లితే.. మళ్లీ వారిని సోమశిలకు తీసుకు వచ్చేవారు. కానీ అందుకు భిన్నంగా ఈ సారి తెలంగాణ పర్యాటక శాఖ ఒక వైపు మాత్రం ప్రయాణం కల్పిస్తుంది. ఈ ప్రయాణంలో లాంచీలోనే ప్రయాణికులకు భోజనం. సాయంత్రం స్నాక్స్ అందజేస్తారు. ఇక శ్రీశైలంలో భక్తుల బసతోపాటు మల్లన్న దర్శన బాధ్యత భక్తులే చూసుకోవాల్సి ఉంది. ఈ ప్యాకేజీలో పెద్దలకు రూ. 2000, పిల్లలకు 1600గా టికెట్ ధర నిర్ణయించారు. ఇక ఈ ప్యాకేజీ ట్రిప్ ఏడాదంతా ఉండదని పర్యాటక శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. కృష్ణానదిలో జలకళ ఉన్నంత వరకే ఈ ట్రిప్ ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. అలాగే బోటులో ప్రయాణికుల విషయంలో తెలంగాణ పర్యాటక శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.

Also Read: కివి పండుతో ఇన్ని లాభాలున్నాయా..?


నాగార్జునసాగర్, శ్రీశైలం మధ్య క్రూయిజ్..

నాగార్జునసాగర్, శ్రీశైలం మధ్య క్రూయిజ్ సర్వీస్‌ను తెలంగాణ పర్యాటక శాఖ శనివారం ప్రారంభించింది. కృష్ణానది వెంబడి పర్యాటక ప్రాంతాలను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ క్రూయిజ్ సర్వీస్‌ను ప్రారంభించినున్నట్లు పర్యాటక శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. నాగార్జున కొండ, నంది కొండ, ఏలేశ్వరం, నల్లమల్ల అటవీ ప్రాంతంలోని సుందర దృశ్యాలను వీక్షించే విధంగా ఈ సర్వీస్‌ను రూపొందించారు. నాగార్జునసాగర్- శ్రీశైలం మధ్య 120 కిలోమీటర్ల దూరం ఉంది. అందుకు ప్రయాణించడానికి 6 గంటల సమయం పడుతుంది.

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 04 , 2024 | 06:48 PM