Share News

సౌందర్య సాగరం

ABN , Publish Date - Sep 29 , 2024 | 10:53 AM

కొన్నిసార్లు చేపలన్నీ బంతిలా మారి, సంఘటితంగా ఈదుతాయి. సముద్రం అడుగున ఈ బంతి చేపల్ని గుటుక్కున మింగాలని ప్రయత్నిస్తున్న తిమింగలం ఫొటో తీసి ఈ ఏడాదికి ‘బెస్ట్‌ ఓషన్‌ ఫొటోగ్రాఫర్‌’ అవార్డు అందుకున్నాడు రఫేల్‌ ఫెర్నాండెజ్‌. ఫ్రాన్స్‌కు చెందిన రఫేల్‌ మెక్సికోలోని సముద్రంలో ఈ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించాడు.

సౌందర్య సాగరం

కొన్నిసార్లు చేపలన్నీ బంతిలా మారి, సంఘటితంగా ఈదుతాయి. సముద్రం అడుగున ఈ బంతి చేపల్ని గుటుక్కున మింగాలని ప్రయత్నిస్తున్న తిమింగలం ఫొటో తీసి ఈ ఏడాదికి ‘బెస్ట్‌ ఓషన్‌ ఫొటోగ్రాఫర్‌’ అవార్డు అందుకున్నాడు రఫేల్‌ ఫెర్నాండెజ్‌. ఫ్రాన్స్‌కు చెందిన రఫేల్‌ మెక్సికోలోని సముద్రంలో ఈ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించాడు. ‘ఓషనోగ్రఫిక్‌’ మ్యాగజైన్‌, బ్లాంక్‌పెయిన్‌ సంయుక్తంగా ‘ఓషన్‌ ఫొట్రోగ్రాఫర్‌’ అవార్డులను అందిస్తున్నాయి. ఈ ఏడాది వచ్చిన 15 వేల ఎంట్రీల్లో రఫేల్‌ మొదటి స్థానం పొందాడు. నీలి గ్రహంగా పేరు తెచ్చుకున్న సముద్రాల్లోని అద్భుతాలు, వాటి పరిరక్షణ, తగిన కార్యాచరణపై ఆలోచింపచేసేవిగా ఈ ఫొటోలు ఉండాలన్నది నిబంధన. వివిధ క్యాటగిరీల్లో ఇతర అవార్డులు అందుకున్న విశేషమైన ఛాయాచిత్రాలే ఇవి.

mag7.jpg

Updated Date - Sep 29 , 2024 | 10:53 AM