Share News

Viral: ఈ తాతను పట్టుకుంటే లాటరీ కొట్టినట్టే.. కోటి రూపాయలు దొరికినట్టే.. వైరల్ పోస్ట్‌పై నెటిజన్ల ఫన్నీ రియాక్షన్లు!

ABN , Publish Date - May 28 , 2024 | 03:47 PM

చిన్న పిల్లలు తప్పిపోయినా లేదా మతి స్థిమితం లేని వ్యక్తులు కనబడకుండా పోయినా వారి కుటుంబ సభ్యులు వెతకడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. చివరకు వారి గుర్తులు, ఫొటోలతో పోస్టర్లు ముద్రించి గోడలపై అంటిస్తారు. తప్పిపోయిన వారిని సురక్షితంగా తీసుకొచ్చిన వారికి బహుమతి ఇస్తామని ప్రకటిస్తారు.

Viral: ఈ తాతను పట్టుకుంటే లాటరీ కొట్టినట్టే.. కోటి రూపాయలు దొరికినట్టే.. వైరల్ పోస్ట్‌పై నెటిజన్ల ఫన్నీ రియాక్షన్లు!
Old man Missing

చిన్న పిల్లలు తప్పిపోయినా లేదా మతి స్థిమితం లేని వ్యక్తులు కనబడకుండా పోయినా (Missing) వారి కుటుంబ సభ్యులు వెతకడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. చివరకు వారి గుర్తులు, ఫొటోలతో పోస్టర్లు ముద్రించి గోడలపై అంటిస్తారు. తప్పిపోయిన వారిని సురక్షితంగా తీసుకొచ్చిన వారికి బహుమతి ఇస్తామని ప్రకటిస్తారు. మహా అయితే ఆ బహుమతి వేలు లేదా లక్ష రూపాయల వరకు ఉంటుంది. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ పోస్ట్ మాత్రం అందుకు భిన్నంగా ఉంది. తప్పిపోయిన ముసలాయనను తీసుకొస్తే ఏకంగా కోటి రూపాయలు (Rs 1 crore Prize) బహుమతిగా ఇస్తారట (Viral Video).


writer_nd అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వృద్ధుడి (Old Man)పోస్టర్ కనిపిస్తోంది. అతడికి సంబంధించిన వివరాలు అందులో ఉన్నాయి. అతడు తప్పిపోయాడని, వెతికి తీసుకొచ్చిన వారికి కోటి రూపాయలు బహుమతిగా ఇస్తామని పేర్కొన్నారు. తమ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నెల 13వ తేదీన షేర్ చేసిన ఈ పోస్ట్‌పై చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


``ఆ తాత దగ్గర నిధి తాళం ఉన్నట్టుంది``, ``ఇప్పుడు యమ్‌రాజ్ మాత్రమే అతన్ని కనుగొంటాడు``, ``నా ఉద్యోగం మానేసి అయినా ఆ తాత కోసం వెతుకుతా``, ``మా ఊరిలో కూడా అలాంటి తాత ఉన్నాడు``, ``ఆ తాత పేరు మీద బాగా ఆస్తులు ఉన్నాయా``, ``ఆ తాత దొరికితే లాటరీ దొరికినట్టే`` అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

Telangana Police: డయల్‌ 100కు పెరిగిన కాల్స్‌ తాకిడి.. ఇంట్లోకి కుక్క వచ్చిందంటూ ఫోన్ చేసిన వ్యక్తి!


Mount Everest: అయ్యబాబోయ్.! అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ మొదలైందా? ఎవరెస్ట్ వీడియో వైరల్!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 28 , 2024 | 03:47 PM