Home Making Tips: ఈ 4 మొక్కలు ఉంటే మీ ఇళ్లంతా సువాసనతో నిండిపోతుంది..!
ABN , Publish Date - Aug 29 , 2024 | 04:21 PM
చాలా మంది ప్రజలు తమ ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇందుకోసం రకరకాల అలంకరణలు చేస్తారు. పూల మొక్కలు, ఇతర అందమైన మొక్కలను సైతం ఇంటి బాల్కనీ, ఇంటి లోపల కూడా ఏర్పాటు చేస్తుంటారు. అయితే, కొన్ని మొక్కలు ఇంటి బాల్కనీలో ఏర్పాటు చేస్తే ఆ ఇల్లంతా పరిమళలాలు వెదజల్లుతుంది.
Best Plants for House: చాలా మంది ప్రజలు తమ ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇందుకోసం రకరకాల అలంకరణలు చేస్తారు. పూల మొక్కలు, ఇతర అందమైన మొక్కలను సైతం ఇంటి బాల్కనీ, ఇంటి లోపల కూడా ఏర్పాటు చేస్తుంటారు. అయితే, కొన్ని మొక్కలు ఇంటి బాల్కనీలో ఏర్పాటు చేస్తే ఆ ఇల్లంతా పరిమళలాలు వెదజల్లుతుంది. ముఖ్యంగా నాలుగు రకాల మొక్కలు ఇంట్లో ఏర్పాటు చేస్తే ఆ ఇళ్లంతా మంచి సువాసనలతో నిండిపోతుందని నర్సరీ నిర్వాహకులు చెబుతున్నారు. మరి ఆ మెక్కలేంటో ఓసారి చూద్దాం..
మల్లె చెట్టు..
మల్లె మొక్కను బాల్కనీలో ఉంచుకుంటే దాని పూల సువాసన ఇంటి మెయిన్ డోర్ నుంచి వెనుక ద్వారం వరకు నాలుగు మూలలకు వ్యాపిస్తుంది. మల్లెపూల పరిమళం ఎవరినైనా పరవశింపజేస్తుంది. ఇల్లు మొత్తం ఆ పువ్వు సువాసనతో నిండిపోతుంది.
విరజాజి పూల మొక్క..
ఇంటి బాల్కనీలో విరజాజి పూల మొక్కను సైతం పెంచుకోవచ్చు. ఈ పువ్వుల సువాసన చాలా మనోహరంగా ఉంటుంది. దాని సువాసన మన మైండ్‌ను ఫ్రెష్‌గా చేస్తుంది. విరజాజి మొక్కను అందమైన కుండలో నాటవచ్చు. బాల్కనీలో కూడా ఉంచొచ్చు.
లిల్లిపూలు/ట్యూబురోస్/రజనీగంధ మొక్క..
బాల్కనీ అందంగా ఉండేందుకు, ఇంటిని సువాసనగా మార్చేందుకు ట్యూబరోస్ మొక్కను పెంచుకోవచ్చు. ట్యూబెరోస్ ఫ్లవర్ సువాసన రాత్రి సమయంలో మరింత ఎక్కువగా వస్తుంది. ఇది రాత్రంతా ప్రశాంతమైన నిద్రను అందిస్తుంది. ఈ మొక్కను బాల్కనీలో లేదా ఇంటి లోపల కూడా పెంచుకోవచ్చు.
గులాబీ మొక్క..
ఇంటి బాల్కనీలో గులాబీ మొక్కను కూడా పెంచుకోవచ్చు. గులాబీ పువ్వుల సువాసన మైండ్‌ని రిఫ్రెష్ చేస్తుంది. గులాబీ పువ్వు పరిమళం ఇల్లంతా నిండిపోతుంది. సాధారణంగా గులాబీలలో వివిధ రంగుల పువ్వుల మొక్కలు ఉంటాయి. ఈ పువ్వులు మంచి సువాసనలను వెదజల్లుతాయి. అందుకే వీటిని ఇంటి బాల్కనీలో పెంచుకోవడం ఉత్తమం.
మరిన్ని ప్రయోజనాలు..
ఈ మొక్కలను ఇంటి ఆవరణలో, బాల్కనీలో పెంచుకోవడం వలన సువాసనలతో పాటు.. ఆ ఇంట్లోని వ్యక్తుల మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది. ఇంట్లో సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.