Share News

Viral: ఇంట్లోకి దూరి దొంగతనం చేశాడు.. ఏసీ ఆన్ చేసి నిద్రలోకి జారుకున్నాడు.. పోలీసులు నిద్రలేపితే..

ABN , Publish Date - Jun 03 , 2024 | 12:04 PM

రాత్రిపూట ఇళ్లలోకి దూరి చోరీలు చేసే దొంగలు చాలా అలర్ట్‌గా ఉంటారు. అందరూ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో చిన్న చప్పుడు కూడా చేయకుండా ఎవరికీ డౌట్ రాకుండా దోచుకుని వెళ్లిపోతుంటారు. ఉదయం లేచి చూస్తే ఇళ్లంతా ఖాళీ అయిపోయి ఉంటుంది.

Viral: ఇంట్లోకి దూరి దొంగతనం చేశాడు.. ఏసీ ఆన్ చేసి నిద్రలోకి జారుకున్నాడు.. పోలీసులు నిద్రలేపితే..
Thief falls asleep in AC room

రాత్రిపూట ఇళ్లలోకి దూరి చోరీలు చేసే దొంగలు (Thief) చాలా అలర్ట్‌గా ఉంటారు. అందరూ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో చిన్న చప్పుడు కూడా చేయకుండా ఎవరికీ డౌట్ రాకుండా దోచుకుని వెళ్లిపోతుంటారు. ఉదయం లేచి చూస్తే ఇళ్లంతా ఖాళీ అయిపోయి ఉంటుంది. అయితే ఒక్కోసారి దొంగలు నిర్లక్ష్యంగా వ్యవహరించి భారీ మూల్యం చెల్లించుకుంటారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లో ఓ దొంగ అలాగే నిద్రకు (Sleep) కక్కుర్తి పడి అడ్డంగా దొరికిపోయాడు. తర్వాతి రోజ ఉదయం అతడిని పోలీసులు నిద్రలేపారు (Crime News).


లక్నోలో (Lucknow) ఇందిరానగర్ సెక్టార్ 20లో నివాసం ఉండే డాక్టర్ సునీల్ పాండే ఇంట్లోకి ఆదివారం తెల్లవారుజామున ఓ దొంగ ప్రవేశించాడు. ఇంటి తాళం పగులగొట్టి పాత్రలు, ఇతర వస్తువులను ప్యాక్ చేసి గోనె సంచిలో ఉంచాడు. అనంతరం బెడ్రూమ్‌లోకి ప్రవేశించి ఏసీ, ఫ్యాన్‌ ఆన్ చేసి కాసేపు నిద్రపోదాం అనుకున్నాడు. అయితే అతడికి తెలివి రాలేదు. ఇంటి తాళం కప్ప పగులగొట్టి ఉండడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు.


పోలీసులు వచ్చే సరికి కూడా ఆ దొంగ ఆ ఇంట్లో సుఖంగా పడుకున్నాడు. పోలీసులు నిద్ర లేపితే లేచి చుట్టూ చూసి షాకయ్యాడు. ఆ దొంగను ముసద్దిపూర్ నివాసి కపిల్ కశ్యప్‌గా గుర్తించారు. తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన కపిల్ ఇన్వర్టర్ బ్యాటరీ, గీజర్, పాత్రలు, మరికొన్ని వస్తువులను రెండు బస్తాల్లో ప్యాక్ చేశాడు. ఆ వస్తువులను బస్తాల్లో ఉంచి అక్కడే సిగరెట్ కాల్చి ఏసీ ఆన్ చేసుకుని నిద్రపోయాడు. గాఢ నిద్రలోకి జారుకుని పోలీసులకు దొరికిపోయాడు. కాగా, కపిల్‌పై అప్పటికే ఆరు దొంగతనం కేసులున్నాయి. నెల రోజుల క్రితమే బెయిల్‌పై విడుదలయ్యాడు.

ఇవి కూడా చదవండి..

Puzzle: ఈ రెండు ఫొటోల్లోని మూడు తేడాలను ఐదు సెకెన్లలో కనిపెట్టగలరేమో ప్రయత్నించండి..!


Opitcal Illusion: మీ కళ్లు ఎంత షార్ప్‌గా ఉన్నాయో టెస్ట్ చేసుకోండి.. ఈ ఫొటోలో తేడాగా ఉన్న దొంగను పట్టుకోండి!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 03 , 2024 | 12:04 PM