Share News

Viral Video: పాపం.. దొంగకు టైం కలిసి రాలేదు.. తుపాకీ గురిపెట్టి బైక్ చోరీకి యత్నం.. చివరకు ఏం జరిగిందో చూస్తే నవ్వాపుకోలేరు..

ABN , Publish Date - Sep 08 , 2024 | 07:22 PM

దుండగలు చోరీ చేసేందుకు రకరకాల ట్రిక్కులు ఉపయోగిస్తుంటారు. కొందరు తుపాకీ గురి పెట్టి మరీ దోచుకుంటుంటారు. అలాంటి సందర్భాల్లో ఎదురు మాట్లాడకుండా వారు అడిగింది ఇచ్చేయడమే ఎంతో ఉత్తమం. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలోనూ అలాగే జరిగింది.

Viral Video: పాపం.. దొంగకు టైం కలిసి రాలేదు.. తుపాకీ గురిపెట్టి బైక్ చోరీకి యత్నం.. చివరకు ఏం జరిగిందో చూస్తే నవ్వాపుకోలేరు..

దుండగలు (Thieves) చోరీ చేసేందుకు రకరకాల ట్రిక్కులు ఉపయోగిస్తుంటారు. కొందరు తుపాకీ (Gun) గురి పెట్టి మరీ దోచుకుంటుంటారు. అలాంటి సందర్భాల్లో ఎదురు మాట్లాడకుండా వారు అడిగింది ఇచ్చేయడమే ఎంతో ఉత్తమం. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలోనూ అలాగే జరిగింది. దొంగ తుపాకీ గురిపెడితే.. ఆ వ్యక్తి సులభంగా బైక్ (Bike) ఇచ్చేశాడు. అయితే ఆ తర్వాత ఏ జరిగిందో చూస్తే మాత్రం నవ్వాపుకోలేరు.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. @JokerOf_India అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది (Viral Video).


వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక వ్యక్తి బైక్‌పై రోడ్డు మీద వెళ్తున్నాడు. ఒక షాప్ ముందు బైక్ అపాడు. వెంటనే ఇద్దరు దొంగలు ఓ బైక్ మీద అక్కడకు వచ్చారు. ఓ దొంగ కిందకు దిగి తుపాకీ గురి పెట్టి బైక్ కావాలని అడిగాడు. ఆ వ్యక్తి వెంటనే బైక్ అప్పగించే తాళాలు కూడా ఇచ్చాడు. అయితే బైక్ ఎక్కిన దొంగ దానిని స్టార్ట్ చేయలేకపోయాడు. ఎన్నిసార్లు కిక్ కొట్టినా అది స్టార్ట్ కాలేదు. చివరకు ఆ వ్యక్తి మరికొందరితో అక్కడకు వచ్చి ఆ దొంగను చితక్కొట్టాడు. కింద పడేసి అందరూ కలిసి దెబ్బలు వేశారు. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమేరాలో రికార్డు అయింది.


ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వీడియోను కొద్ది గంటల్లోనే 19 వేల మందికి పైగా వీక్షించారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ``పాపం.. దొంగకు టైం కలిసి రాలేదు``, ``ఆ బైక్ తన యజమాని పట్ల విశ్వాసం చూపించింది``, ``రెండో దొంగకు భవిష్యత్తు అర్థమైంది.. వెంటనే పారిపోయాడు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: కాళ్లు లేకపోతేనేం.. ఈమె ధైర్యం, పట్టుదల ముందు ఎవరు సరిపోతారు.. ఆమె డ్యాన్స్ చూడండి..


Viral Video: ఆహా.. ఈ కుర్రాడి ట్యాలెంట్‌కు అవాక్కవ్వాల్సిందే.. అమ్మాయిలా ఎలా డ్యాన్స్ చేశాడో చూడండి..


Picture Puzzle: మీ కళ్లకు స్పెషల్ టెస్ట్.. ఈ రెండు ఫొటోలోని మూడు తేడాలను 10 సెకెన్లలో కనుక్కోండి...


Viral Video: వామ్మో.. ఇదెక్కడి మంచం రా నాయనా.. వంద మంది ఒకేసారి కూర్చున్నా సరిపోతుందేమో..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 08 , 2024 | 07:22 PM