Share News

Viral: ఇంత టాలెంటెడ్‌గా ఉంటే జాబ్ ఇవ్వము! యువతికి షాకిచ్చిన గూగుల్!

ABN , Publish Date - Oct 18 , 2024 | 08:05 PM

ఎవరికైనా ఉద్యోగం దొరకలేదంటే టాలెంట్ తక్కువై ఉంటుందనో లేదా పోటీ ఎక్కువగా ఉందనో అనుకుంటాం. కానీ ఓ యువతికి టాలెంట్ ఎక్కువ కావడంతో ఉద్యోగం దక్కలేదు. గూగుల్‌లో జాబ్‌కు దరఖాస్తు చేసుకున్న ఓ యువతికి ఎదురైన వింత అనుభవం ఇది.

Viral: ఇంత టాలెంటెడ్‌గా ఉంటే జాబ్ ఇవ్వము! యువతికి షాకిచ్చిన గూగుల్!

ఇంటర్నెట్ డెస్క్: ఎవరికైనా ఉద్యోగం దొరకలేదంటే టాలెంట్ తక్కువై ఉంటుందనో లేదా పోటీ ఎక్కువగా ఉందనో అనుకుంటాం. కానీ ఓ యువతికి టాలెంట్ ఎక్కువ కావడంతో ఉద్యోగం దక్కలేదు. గూగుల్‌లో జాబ్‌కు దరఖాస్తు చేసుకున్న ఓ యువతికి ఎదురైన వింత అనుభవం ఇది. టాలెంట్ ఎక్కువైనందుకే జాబ్ ఇవ్వలేకపోతున్నామంటూ గూగుల్ పంపించిన లేఖను కూడా మహిళ షేర్ చేసింది. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.

Viral: మనిషంటే నువ్వే బాసూ! అచేతనంగా పడున్న పామును ఎలా కాపాడాడో చూడండి!


అనుష్క శర్మ అనే యువతి తనకెదురైన వింత అనుభవాన్ని తాజాగా నెట్టింట పంచుకుంది. ఇటీవల ఆమె గూగుల్‌లో ఓ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంది. అయితే, ప్రస్తుతం ఆమె చేస్తున్న జాబ్‌కు ఇది భిన్నమైనది. ప్రస్తుత ఉద్యోగంతో పోలిస్తే తక్కవ నైపుణ్యాలు అవసరమయ్యే జాబ్ ఇది. అయితే, యువతి మాత్రం రెజ్యూమేలో తన స్కిల్స్‌, అనుభవం గురించి యథాతథంగా పేర్కొంది.

యువతి దరఖాస్తును పరిశీలించిన గూగుల్.. ఆమెకు జాబ్ ఇవ్వలేమంటూ సందేశం పంపించింది. అయితే, అందులో పేర్కొన్న కారణాలు చదవిని యువతికి దిమ్మతిరిగినంత పనైంది. ‘‘మీ రెజ్యూమేను పరిశీలించాము. ఈ జాబ్‌కు అవసరమైన వాటికంటే మీకు ఎక్కువ నైపుణ్యాలు ఉన్నట్టు మాకు అనిపించింది. తమ అర్హతకు దిగువన ఉన్న ఉద్యోగాల్లో అభ్యర్థులు అసంతృప్తి లోనైన త్వరగా రాజీనామా చేయడం మేము గతంలో చాలా సార్లు చూశాము. కాబట్టి, ఈ జాబ్ ఇవ్వలేకపోతున్నాము’’ అని చెప్పింది.


Viral: ఆటోలో ఒంటరిగా మహిళ.. సడెన్‌గా ఓ వ్యక్తి లోపలికొచ్చి.. షాకింగ్ వీడియో!

ఈ సందేశం తాలూకు వీడియోను నెట్టింట షేర్ చేసిన అనుష్క.. ఆశ్చర్యం వ్యక్తం చేసింది. టాలెంట్ ఎక్కువైనందుకు జాబ్ లభించని ఘటనలు కూడా ఉంటాయని నాకు తెలీదు’’ అని ఆమె ట్వీట్ చేసింది.

ఇక సహజంగానే ఈ ఉదంతంపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అనేక మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొందరు సెటైర్లు పేల్చారు. అయితే, జాబ్ తిరస్కరణకు గురికావడం దైవఘటనగా భావించాలని ఓ వ్యక్తి అన్నాడు. ఈ అనుభవంతో సొంత సంస్థ స్థాపించుకుని వృద్ధిలోకి రావాలని సూచించాడు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో తెగ వైరల్ అవుతోంది.

Read Latest and Viral News

Updated Date - Oct 18 , 2024 | 08:09 PM