Share News

Viral Video: ఆహా.. ఇది నిజమైన ఇంజినీరింగ్ ప్రతిభ.. వేగనార్ కార్‌ను ఎలా మార్చేశాడో చూడండి..

ABN , Publish Date - Sep 03 , 2024 | 06:23 PM

క్రియేటివిటీ, టెక్నాలజీ విషయంలో భారతీయులకు సాటి వచ్చే వారు ఉండరేమో. మనదేశంలో సామాన్యులు కూడా ఇంజినీర్లను మించిన ప్రతిభ కనబరుస్తారు. తమ అద్భుత ట్యాలెంట్‌తో అందర్నీ అబ్బురపరుస్తారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ తరహా వ్యక్తులు ప్రతిభ వెలుగులోకి వస్తోంది.

Viral Video: ఆహా.. ఇది నిజమైన ఇంజినీరింగ్ ప్రతిభ.. వేగనార్ కార్‌ను ఎలా మార్చేశాడో చూడండి..
WagonR modification viral video

క్రియేటివిటీ, టెక్నాలజీ విషయంలో భారతీయులకు సాటి వచ్చే వారు ఉండరేమో. మనదేశంలో సామాన్యులు కూడా ఇంజినీర్లను మించిన ప్రతిభ (Talent) కనబరుస్తారు. తమ అద్భుత ట్యాలెంట్‌తో అందర్నీ అబ్బురపరుస్తారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ తరహా వ్యక్తులు ప్రతిభ వెలుగులోకి వస్తోంది. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి ఓ వేగనార్ (WagonR) కారును థార్‌ (Thar)లా మార్చేశాడు (Viral Video).


knowledgeacquisition అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ విచిత్రమైన వాహనం రోడ్డు మీద వెళ్తోంది. ఆ వాహనాన్ని చూసిన సోషల్ మీడియా యూజర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆ వీడియోలో ఓ తెల్లటి వ్యాగనార్ కారు రోడ్డుపై వేగంగా వెళ్తోంది. అయితే ఆ కారు వెనుక భాగం టాప్ చూస్తే మతిపోవాల్సిందే. ఎందుకంటే అక్కడ రెగ్యులర్‌గా ఉండాల్సిన టాప్ కాకుండా.. మహీంద్రా థార్‌కు ఉండే టాప్ లాంటిది ఉంది. అందువల్ల ఆ కారు రూపం చాలా వింతగా కనబడుతోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఈ వైరల్ వీడియోను మిలియన్ల మంది వీక్షించారు. దాదాపు 1.5 లక్షల మంది లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇది థార్‌కు బంధువు``, ``ఇది థార్గన్ ఆర్``, ``వ్యాగన్ థార్ ROXX``, ``ఇండియా బిగినర్స్ కోసం కాదు``, ``చాలా శక్తివంతమైన జుగాడ్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఈ మ్యాచ్‌ను దేవుడు కూడా ఎంజాయ్ చేస్తాడట.. కామెంటరీ వింటే షాక్‌తో నోరెళ్లబెట్టాల్సిందే..


Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. వరద నీటిలో మొసళ్ల బీభత్సం.. ఇది వడోదరలో చిత్రీకరించిందేనా?


Viral Video: పెళ్లి వేడుకలో పానీ పూరీ.. పానీ వేసేందుకు వాడిన టెక్నిక్ చూస్తే నివ్వెరపోవాల్సిందే..


Picture Puzzle: మీ దృష్టికి స్పెషల్ టెస్ట్.. ఈ రెండు చేపల్లోని మూడు తేడాలను 8 సెకెన్లలో కనుక్కోండి...


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 03 , 2024 | 06:24 PM