Viral video: ఏం క్రియేటివిటీ బాసూ.. ట్రైన్ కింద నుంచి కార్లు, పై నుంచి లారీలు ఎలా వెళ్తున్నాయో చూడండి..
ABN , Publish Date - Nov 18 , 2024 | 12:23 PM
ప్రస్తుత డిజిటల్ యుగంలో నూతన ఆవిష్కరణలు వైరల్ కావడానికి ఎక్కువ సమయం పట్టడం లేదు. క్షణాల్లోనే అవి వైరల్‌గా మారి అందరినీ చేరుతున్నాయి. చూసిన వారి ప్రశంసలు అందుకుంటున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చాలా మంది తమ బుర్రలకు పదును పెట్టి అమోఘమైన ఆవిష్కరణలు చేస్తుంటారు. ఉన్న వనరులతోనే అద్భుతాలను సృష్టించడానికి ప్రయత్నిస్తుంటారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో అలాంటి ఆవిష్కరణలు వైరల్ కావడానికి ఎక్కువ సమయం పట్టడం లేదు. క్షణాల్లోనే అవి వైరల్‌గా మారి అందరినీ చేరుతున్నాయి. చూసిన వారి ప్రశంసలు అందుకుంటున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన వారు ఆ క్రియేటివిటీ (Creativity)కి షాక్ అవుతున్నారు (Viral Video).
all_vlogging_here అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. పైన రైలు (Train) వెళ్తున్నట్టు కింద నుంచి వాహనాలు వెళ్తున్నట్టు కనిపిస్తోంది. ఆ రైలు పై భాగంలో కొన్ని ట్రక్కులు వెళ్తున్నట్టు కనిపిస్తోంది. నిజానికి అది రైలు.. ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ (Fly over). మన దేశంలోని ఏ నగరంలోనైనా ఇలాంటి ఫ్లై ఓవర్లు కనిపిస్తుంటాయి. అయితే పాట్నా (Patna)లోని ఈ వంతెన ఇతర వంతెనల కంటే భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఆ వంతెన కింద భాగంలో రైల్వే కోచ్‌లను పోలినట్టు పెయింటింగ్ చేశారు. కిటికీల నుంచి చూస్తున్న వ్యక్తుల చిత్రాలను కూడా పెయింట్ చేశారు. అంతే కాదు వంతెన కింది భాగంలో రైల్వే చక్రాలను కూడా తయారు చేశారు. ఓవరాల్‌గా ఫ్లై ఓవర్ బ్రిడ్జ్‌కు రైలు రూపాన్ని ఇచ్చారు (Train Bridge).
ఈ వీడియో సోషల్ మీడియా జనాలను ఆకట్టుకుని విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోను ఇప్పటివరకు దాదాపు 40 లక్షల మంది వీక్షించారు. 4 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``వీరి క్రియేటివిటీ పీక్స్‌లో ఉంది``, ``ఇది నిజంగా మంచి ఆలోచన``, ``తక్కువ ఖర్చుతో గొప్ప అందం వచ్చింది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Elon Musk: అమెరికా టు ఢిల్లీ.. కేవలం 30 నిమిషాలు.. ఎలన్ మస్క్ ప్రాజెక్ట్ విజయవంతం అయితే..
Viral Video: తప్పక చూడాల్సిన వీడియో.. మంచు మీద లావా ప్రవహిస్తుంటే ఎలా ఉందో చూడండి..
Viral Video: ఇదేందయ్యా ఇదీ.. నిజమా? మాయా?.. కీ బోర్డ్‌తో కారును ఎలా కంట్రోల్ చేస్తున్నాడో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి