Viral Video: బంగారం, వెండి పానీపూరీలను చూశారా? వైరల్ అవుతున్న వీడియో చూస్తే అవాక్కవడం ఖాయం..!
ABN , Publish Date - Apr 15 , 2024 | 02:21 PM
వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ఇష్టపడే ఆహారం పానీపూరీ. పానీపూరీ, గోల్‌గప్పా, గప్‌చుప్.. పేరు ఏదైనా దానిని చూస్తే చాలు నోరూరిపోతుంటుంది. వీటికి ఉండే క్రేజ్ దృష్ట్యా ఎప్పటికప్పుడు సరికొత్త రీతిలో పానీపూరీలను తయారు చేసే వారు పుట్టుకొస్తుంటారు.
వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ఇష్టపడే ఆహారం పానీపూరీ (Panipuri). పానీపూరీ, గోల్‌గప్పా, గప్‌చుప్.. పేరు ఏదైనా దానిని చూస్తే చాలు నోరూరిపోతుంటుంది. వీటికి ఉండే క్రేజ్ దృష్ట్యా ఎప్పటికప్పుడు సరికొత్త రీతిలో పానీపూరీలను తయారు చేసే వారు పుట్టుకొస్తుంటారు. అయితే మీరు ఎప్పుడైనా బంగారం లేదా సిల్వర్ పానీపూరీలను చూశారా? (Gold Panipuri) ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు (Viral Video).
గుజరాత్ (Gujarat)లోని అహ్మదాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి పానీ పూరీ సరికొత్త వెర్షన్‌ను లాంఛ్ చేశాడు. బంగారు, వెండి పూతతో తయారు చేసిన పానీపూరీలను అతడు విక్రయిస్తున్నాడు. ఆ పానీపూరీల్లో డ్రైఫ్రూట్స్, తేనె కూడా వేస్తున్నాడు. వాటిని బంగారు రంగు ప్లేట్‌లోనే పెట్టి విక్రయిస్తున్నాడు. ప్రస్తుతం ఈ పానీపూరీలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ క్రియేటివిటీని కొందరు మెచ్చుకుంటున్నారు. మరికొందరు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ పానీ పూరి పేరు షరీట్. ప్రస్తుతం ఈ పానీ పూరీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. cherishing_the_taste అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ అయిన ఈ వీడియోకు లక్షల కొద్దీ వ్యూస్ వచ్చాయి. 53 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``బ్రదర్.. వీటి ధర ఎంత``, ``ఇది డబ్బున్న వారి పానీపూరీ``, ``దీనిని బప్పీలహరి పానీపూరీ అంటారు`` అంటూ కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: చపాతీలు ఇలా కూడా చెయ్యొచ్చా? ఓ ఇల్లాలి వంటింటి చిట్కాపై నెటిజన్లు ఏమంటున్నారంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..