Viral Video: ప్రేమ అంటే ఇదీ.. ఆవు కోసం ఎద్దు ఎంతలా ఆరాటపడిందో చూడండి.. ఎమోషనల్ వీడియో వైరల్..
ABN , Publish Date - Oct 27 , 2024 | 11:05 AM
ప్రేమ, అనుబంధం, అప్యాయత అనే బంధాలు మనుషుల మధ్యనే ఉంటాయనుకోవడం తప్పు. మనుషుల కంటే స్వచ్ఛంగా, కల్మషరిహితంగా జంతువుల మధ్యనే ఆ బంధాలు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే మీరు కూడా ఎమోషనల్ అవుతారు.
ప్రేమ, అనుబంధం, అప్యాయత అనే బంధాలు మనుషుల మధ్యనే ఉంటాయనుకోవడం తప్పు. మనుషుల కంటే స్వచ్ఛంగా, కల్మషరిహితంగా జంతువుల మధ్యనే ఆ బంధాలు (Love) ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో (Emotional Video) చూస్తే మీరు కూడా ఎమోషనల్ అవుతారు. వ్యాన్‌లో బంధించి తీసుకెళ్లిపోతున్న ఆవు (Cow) కోసం ఓ ఎద్దు (Bull) పడిన ఆరాటం చూస్తే అసలైన ప్రేమ అంటే ఏంటో ఆర్థమవుతుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన జనాలు ఎమోషనల్ అవుతున్నారు (Viral Video).
zindagi.gulzar అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోను తమిళనాడులో చిత్రీకరించారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ ఎద్దు ఓ వ్యాన్ వెనుక పరిగెడుతోంది. ఆ వ్యాన్‌లో ఓ ఆవు ఉంది. డెయిరీ యజమాని ఆ ఆవును వేరే వ్యక్తికి అమ్మేశాడు. ఆ వ్యక్తి వ్యాన్‌లో కట్టేసి ఆ ఆవును తీసుకెళ్లిపోతున్నాడు. అయితే అప్పటివరకు తనతో సన్నిహితంగా ఉన్న ఆవు వెళ్లిపోవడాన్ని ఆ ఎద్దు తట్టుకోలేకపోయింది. వ్యాన్‌ను వెంబడించింది. ఎద్దు పరుగును చూసి డ్రైవర్ వ్యాన్‌ను ఆపాడు. అప్పుడు ఆ ఎద్దు ఆవు దగ్గరకు వెళ్లి ప్రేమగా నిమిరింది. వ్యాన్ డ్రైవర్ దగ్గరకు వెళ్లి దీనంగా చూస్తూ అరిచింది.
ఆ వ్యాన్ డ్రైవర్ కొద్ది సేపటి తర్వాత వ్యాన్‌ను తీసుకెళ్లిపోయాడు. దీంతో ఆ ఎద్దు కొద్ది దూరం పరిగెత్తి ఆగిపోయింది. ఆ రోడ్డు మీద వెళ్తున్నవారు ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 5 లక్షల మందికి పైగా వీక్షించారు. దాదాపు 40 వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ``ఇది కల్మషం లేని ప్రేమ``, ``ఆ ఎద్దు తన ప్రేయసిని విడిపించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించింది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: వావ్.. ఎంట్రీ అదిరిపోయింది.. పెళ్లి రోజు నూతన వధూవరుల ఎనర్జీ చూస్తే ఫిదా కావాల్సిందే..
Viral Video: ఆ మహిళా పోలీస్‌కు ఏమైంది? నడిరోడ్డుపై మహిళను కౌగిలించుకుని, ముద్దు పెట్టి హల్చల్..
Viral Video: ఛీ.. ఛీ.. జెయింట్ వీల్‌ను కూడా వదలరా.. బహిరంగంగా యువతీయువకుల పాడు పనులు..
Viral: అడవి ఏనుగుతో సెల్ఫీ.. ఆగ్రహించిన గజరాజు.. చివరకు ఆ యువకుడి పరిస్థితి ఏమైందంటే..
Viral Video: సూపర్ ఫైట్ అంటే ఇదీ.. ఇద్దరు మహిళలు బిందెలతో ఎలా కొట్టుకున్నారో చూడండి.. వీడియో వైరల్..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోెసం క్లిక్ చేయండి..