Kimchi Recipe: కొరియన్ వంటకాల్లో నోరూరించే కిమ్చి.. అచ్చం మన ఆవకాయలానే.. !
ABN , Publish Date - Jan 27 , 2024 | 04:18 PM
ఫేమస్ ఆహారాలలో కిమ్చి ఒకటి. ఈ రుచికరమైన వంటకం కూరగాయలను పులియబెట్టి.. అంటే అచ్చం మన పచ్చళ్లలానే తయారుచేస్తారు. దీనిని కూడా ముందుగానే తయారుచేసుకోవాలి.
కొరియన్ వంటకాల గురించి మాట్లాడుకునేప్పుడు అక్కడి ఫేమస్ ఆహారాలలో కిమ్చి ఒకటి. ఈ రుచికరమైన వంటకం కూరగాయలను పులియబెట్టి.. అంటే అచ్చం మన పచ్చళ్లలానే తయారుచేస్తారు. దీనిని కూడా ముందుగానే తయారుచేసుకోవాలి. ఇది కూడా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఒక కొరియన్ కుటుంబం శాకాహారి కిమ్చిని పెద్ద బ్యాచ్ అంతా కలిపి తయారు చేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ రీల్ ఆన్లైన్లో చూసి కిమ్చిని ఇష్టపడే భోజన ప్రియులంతా తెగ చూస్తున్నారు. కొందరు కొరియన్ మహిళలు కలిసి గుంపుగా ఈ కిమ్చి తయారీలో ఉపయోగించే పదార్థాలను కంటైనర్లలో వేసి ఉంచారు. వరుసగా క్యాబేజీని తరుగుతున్నారు.
ఈ తయారీ గురించి తెలుసుకుందాం.
నాపా క్యాబేజీతో తయారు చేసే కిమ్చికి ముందుగా క్యాబేజీ ముక్కలను తరిగి పెట్టుకోవాలి. తరువాత వీటిని ఉప్పు నీటిలో వేసి ఉంచాలి. బాగా నానిన తర్వాత క్యాబేజి ముక్కలను తీసి ఆరబెట్టాలి. అదే విధంగా ముల్లంగిని కూడా తయారు చేయాలి. కారం పొడితో పాటు బియ్యప్పిండి వేసి కలపాలి. తరువాత, తరిగిన బేరి, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఎర్ర మిరపకాయలను పేస్ట్‌గా తయారు చేయాలి. ఈ పేస్ట్‌ను ముందుగా తయారుచేసిన మిశ్రమంలో కలపాలి. పామ్ షుగర్, స్టెవియా, నువ్వులు కూడా దీనికి కలుపుతారు. అన్ని పదార్థాలు ఒక పెద్ద పాత్రలో వేసి ఒకదానితో ఒకటి పూర్తిగా కలియబెట్టాలి.
సీ స్టాఘోర్న్ అని పిలిచే ఒక ప్రత్యేక పదార్ధం కూడా ఈ ప్రక్రియలో కలుపుతారు. ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని టైట్ గాజు సీసాల్లో వేసి మూత బిగిస్తే.. దాదాపు చాలా రోజులు నిల్వ ఉంటుంది. దీనిని మూడు రకాలుగా తయారు చేస్తారు. సాంప్రదాయ నాపా క్యాబేజీ కిమ్చి అని, టోంగ్‌బేచు కిమ్చి, అకా బేచు కిమ్చి లేదా పోగి కిమ్చి అని పిలుస్తారు. అచ్చం మన ఆవకాయంత కమ్మని రుచితో తయారు చేసే ఈ పదార్థాన్ని ఎంతో ఇష్టంగా కొరియన్ వెజిటేరిన్స్ తింటారు. అయితే ప్రోసెస్ అలాగే ఉన్నా రుచి మన ఆవకాయతో అస్సలు పోలదు మరి.. వీలైతే మీరూ తయారుచేసి చూడండి.
ఇది కూడా చదవండి: ప్రయాణాల్లో ఈ నోరూరించే సిటీ వంటకాలను ఎప్పుడైనా టేస్ట్ చేసారా..!
కిమ్చి ఇలా చేయండి
1. ఒక పెద్ద గిన్నెలో, ప్రతి క్యాబేజీ ఆకుపై కొన్ని కిమ్చి పేస్ట్‌ను వేయండి. ప్రతి ఆకును పేస్ట్‌తో కలిపినప్పుడు, దానిని ఒక చిన్న ప్యాకెట్‌లో చుట్టి, కూజాలో లేదా, ప్లాస్టిక్ కంటైనర్‌లో వేయలి.
2. ఇది పులియడానికి కొన్ని రోజులు పడుతుంది.
3. కిమ్చి గది ఉష్ణోగ్రత, తేమను బట్టి ఒకటి లేదా రెండు రోజులు పులుస్తుంది. గది ఎంత వెచ్చగా ఉంటే, కిమ్చి అంత వేగంగా పులియడం జరుగుతుంది.
4. ఇది పులిసిన తర్వాత వాసన, పుల్లని రుచిని కలిగి ఉంటుంది. దీనిని నిల్వచేయడానికి కూజాను ఉపయోగిస్తే, ఎక్కువరోజులు నిల్వ ఉంటుంది.
5. పులియడం మొదలైన తర్వాత, రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయాలి. సమయం గడుస్తున్న కొద్దీ కిమ్చి మరింత పుల్లగా తయారవుతుంది.