Share News

Viral: జపాన్‌లో ఆ షాప్‌లో తినాలంటే రాసి పెట్టి ఉండాలి.. ఇప్పుడు ఆర్డర్ చేస్తే 38 ఏళ్ల వరకు వెయిట్ చేయాల్సిందే..

ABN , Publish Date - Jan 19 , 2024 | 09:01 AM

సాధారణంగా ఏదైనా హోటల్ లేదా రెస్టారెంట్‌లో తయారు చేసే ఆహార పదార్థం రుచి బాగుంటే దానిని తినడానికి చాలా మంది ఎగబడతారు. దాని కోసం ఎంతసేపైనా ఎదురు చూస్తారు. అయితే జపాన్‌లోని ఓ ఫుడ్ స్టాల్‌లో తయారు చేసే క్రోక్వెట్‌లు తినాలంటే ఏకంగా 38 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే.

Viral: జపాన్‌లో ఆ షాప్‌లో తినాలంటే రాసి పెట్టి ఉండాలి.. ఇప్పుడు ఆర్డర్ చేస్తే 38 ఏళ్ల వరకు వెయిట్ చేయాల్సిందే..

సాధారణంగా ఏదైనా హోటల్ లేదా రెస్టారెంట్‌లో తయారు చేసే ఆహార పదార్థం రుచి బాగుంటే దానిని తినడానికి చాలా మంది ఎగబడతారు. దాని కోసం ఎంతసేపైనా ఎదురు చూస్తారు. అయితే జపాన్‌ (Japan)లోని ఓ ఫుడ్ స్టాల్‌లో ప్రత్యేకంగా తయారు చేసే కోబ్ బీఫ్ క్రోక్వెట్‌లు (Kobe beef croquettes) తినాలంటే మాత్రం ఏకంగా 38 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పటికే ఆ షాప్ వద్ద 38 సంవత్సరాలకు సరిపడా వెయిటింగ్ లిస్ట్ ఉంది.

సెంట్రల్ జపాన్ ప్రిఫెక్చర్ ఆఫ్ హ్యోగోలో షిగేరు నిట్టా (Shigeru Nitta) అనే మాంసం దుకాణం ఉంది. ఈ అవుట్‌లెట్‌లో డీప్-ఫ్రైడ్ గొడ్డు మాంసం, బంగాళాదుంప డంప్లింగ్‌లను గ్రేడ్ A5 కోబ్ బీఫ్ క్యూబ్‌ల రూపంలో తయారు చేస్తుంది. ఈ దుకాణం సిబ్బంది ప్రత్యేకంగా తమ పొలంలో ``రెడ్ ఆండీస్``` బంగాళదుంపలను పండిస్తారు. అలాగే హ్యోగో ప్రిఫెక్చర్ సమీపంలోని అవాజీ ద్వీపం నుంచి వచ్చే ఉల్లిపాయలను జోడిస్తారు. ఈ మిశ్రమానికి గొడ్డు మాంసాన్ని జోడించి కొద్ది రోజుల పాటు ఫ్రీజ్ చేసి డెలివరీ చేస్తారు (38 Years waiting)

ఈ దుకాణంలోని ఓ క్రొక్వెట్ ధర 300 యెన్‌లు (రూ.168). ``మేం విక్రయించే ఒక్కో క్రోక్వెట్ మీద 300 యెన్‌లు కోల్పోతున్నాం అని తెలుసు. ఎందుకంటే మేం వాడే గొడ్డు మాంసం చాలా ఖరీదైనది. కానీ, ప్రజలకు మంచి రుచి, నాణ్యత గల ఆహారాన్ని తక్కువ ధరకు అందించాలని అనుకుంటున్నాం`` అని షిగేరు నిట్టా యజమాని తెలిపారు. కాగా, ఈ అవుట్‌లెట్‌లో ప్రతిరోజూ 200 క్రోక్వెట్‌లను మాత్రమే ఉత్పత్తి చేస్తారు. ఇప్పటికే ఆర్డర్ లిస్ట్‌లో దాదాపు 63,000 మంది పేర్లు ఉన్నాయట. ఈ రోజు ఆ క్రోక్వెట్ కోసం ఆర్డర్లు ఇస్తే, 2062వ సంవత్సరంలోనే మనకు అందుతుంది.

Updated Date - Jan 19 , 2024 | 09:55 AM