Share News

Viral Video: చెరువులోకి దిగుతున్న మూడు సింహాలు.. దూరం నుంచి చూసిన హిప్పో.. వీడియో చూస్తే ఒళ్లు జలదరించాల్సిందే..!

ABN , Publish Date - Jul 02 , 2024 | 04:22 PM

సింహాలను అడవులకు రారాజులగా భావిస్తాం. జంతురాజ్యంలో సింహాన్ని మించింది ఏదీ లేదనుకుంటాం. అలాంటి సింహాలు భయంతో పారిపోవడం మీరెప్పుడైనా చూశారా? సింహాలపై దాడి చేసిన జంతువును మీరు చూశారా? ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు.

Viral Video: చెరువులోకి దిగుతున్న మూడు సింహాలు.. దూరం నుంచి చూసిన హిప్పో.. వీడియో చూస్తే ఒళ్లు జలదరించాల్సిందే..!
Hippopotamus attacks Lions

సింహాలను (Lions) అడవులకు రారాజులగా భావిస్తాం. జంతురాజ్యంలో సింహాన్ని మించింది ఏదీ లేదనుకుంటాం. అలాంటి సింహాలు భయంతో పారిపోవడం మీరెప్పుడైనా చూశారా? సింహాలపై దాడి చేసిన జంతువును మీరు చూశారా? ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Lion Videos) చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. ఆ వీడియోలో మూడు సింహాలను ఓ హిప్పోపొటామస్ (Hippopotamus ) పరుగులు తీయించింది. వాటిని వెంటాడి భయపెట్టింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


@AMAZlNGNATURE అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో మూడు సింహాలు ఓ చెరువును దాటేందుకు ప్రయత్నించాయి. మూడూ ఒకేసారి చెరువులోకి దిగాయి. వాటిని చాలా దూరం నుంచి ఓ హిప్పోపొటామస్ చూసింది. అంత దూరం నుంచి అత్యంత వేగంగా ఈదుకుంటూ సింహాల దగ్గరకు వచ్చింది. ఆ హిప్పోమటస్ కోపాన్ని చూసిన సింహాలు భయంతో జడుసుకున్నాయి. దాని నుంచి తప్పించుకునేందుకు పరుగులు పెట్టాయి (Hippopotamus attacks Lions). ఒక సింహాన్ని తన కొమ్ములతో హిప్పో పొడిచేసింది. ఆ సింహాలు ఒడ్డు ఎక్కి పారిపోయే వరకు ఆ హిప్పో శాంతించలేదు.


ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 9.8 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. 10 కంటే ఎక్కువ మంది లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``ఆఫ్రికాలో అన్ని ఇతర జంతువుల కంటే హిప్పోపొటామస్ ఎక్కువ మందిని చంపుతుంది``, ``హిప్పోకు కోపం వస్తే ఏ జంతువూ నిలవలేదు``, ``ఆ హిప్పో ఎంత వేగంగా ఈత కొట్టిందో చూడండి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Rolls-Royce: రోల్స్ రాయిస్ అమ్మేసి ఆటో కొనుక్కోండి.. ఢిల్లీ రోడ్డుపై ఆగిపోయిన ఖరీదైన కారుపై నెటిజన్ల సెటైర్లు!


Viral Video: వేగంగా వస్తున్న రైలు ముందు యువతి రీల్.. డ్రైవర్ ఆమెను ఎలా కాపాడాడో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 02 , 2024 | 04:22 PM