Share News

Viral Video: పెద్దపులికి అయినా ఈ కష్టం తప్పదు.. నీటిలో పెద్ద పులి ఆపసోపాలు ఎందుకోసం అంటే..

ABN , Publish Date - Apr 20 , 2024 | 03:54 PM

ప్రస్తుతం ఎండలు ఒక రేంజ్‌ఋలో హీటెక్కిస్తున్నాయి. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా ఉష్ణోగ్రతలు ఒక రేంజ్‌లో నమోదవుతున్నాయి. దీంతో అత్యవసరమైతే తప్ప జనాలు ఎవరూ బయటకు రావడం లేదు. మనుషులే కాదు.. వన్య ప్రాణులు కూడా ఈ ఎండలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

Viral Video: పెద్దపులికి అయినా ఈ కష్టం తప్పదు.. నీటిలో పెద్ద పులి ఆపసోపాలు ఎందుకోసం అంటే..
Tiger

ప్రస్తుతం ఎండలు (Summer Heat) ఒక రేంజ్‌ఋలో హీటెక్కిస్తున్నాయి. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా ఉష్ణోగ్రతలు ఒక రేంజ్‌లో నమోదవుతున్నాయి. దీంతో అత్యవసరమైతే తప్ప జనాలు ఎవరూ బయటకు రావడం లేదు. మనుషులే కాదు.. వన్య ప్రాణులు (Wild Animals) కూడా ఈ ఎండలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. తాజాగా ఓ పెద్ద పులి (Tiger) ఎండ దాడికి తట్టుకోలేక నీటిలో కూర్చుని ఆపోసోపాలు పడింది. ఐఏఎస్ అధికారి ఈ వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు (Viral Video).


తమిళనాడులోని నీలగిరి కొండల్లో ఉన్న మదుమలై టైగర్ రిజర్వ్‌కు (Mudumalai Tiger Reserve) సంబంధించిన వీడియోను ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు పంచుకున్నారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ పెద్దపులి అడవిలోని ఓ చిన్న మడుగులో కూర్చుని ఉంది. ఎంతసేపటికీ బయటకు రాలేదు. ఎండ వేడి తట్టుకోలేక పెద్ద పులి అలా నీటిలో ఉండిపోయింది. ``మదుమలై టైగర్ రిజర్వ్‌లో వేసవి మధ్యాహ్నం వేట తర్వాత ఎండ నుంచి కూలింగ్ కోసం నీటిని ఆశ్రయించిన పెద్ద పులి`` అంటూ క్యాప్షన్ ఇచ్చారు.


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 45 వేల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``పులి సేద తీరడానికి సరిపోయే స్పాట్``, ``వర్షాలు పడితే తప్ప మనుషులు, జంతువులు మనుగడ సాగించలేరు``, ``అడవికి రాణి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: వామ్మో.. ఈ టీ తాగాలంటే ధైర్యం ఉండాల్సిందే.. టీ ఎలా తయారు చేస్తున్నాడో చూడండి..


Puzzle: మీ కళ్లకు అసలైన పరీక్ష.. ఈ ఫొటోలో తలుపు లేని ఇల్లు ఎక్కడ ఉందో 7 సెకెన్లలో కనిపెట్టండి..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 20 , 2024 | 03:54 PM