Viral: ఈ డ్రైవర్ తెలివి మామూలుగా లేదుగా! యాక్సిడెంట్స్ కాకుండా గొప్ప ప్లానే వేశాడు!
ABN , Publish Date - Feb 10 , 2024 | 04:49 PM
హైవేలపై యాక్సిడెంట్లు జరక్కుండా ఓ లారీ డ్రైవర్ వేసిన ఐడియా ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్న్‌ట్ డెస్క్: యాక్సిడెంట్లు జరక్కుండా ఉండేందుకు ఓ డ్రైవర్ చేసిన ప్రయత్నంపై ప్రస్తుతం నెట్టింట ప్రశంసల జల్లు కురుస్తోంది. డ్రైవర్ ఐడియా అద్భుతంగా ఉందంటూ నెటిజన్లు వేనోళ్ల పొడుగుతున్నారు. అతడి తెలివికి ఆశ్చర్యపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral Video) మారింది.
సాధారణంగా లారీలు, ట్రక్కుల వంటి భారీ వాహనాల వెనక ‘30 అడుగుల దూరం పాటించండి’, ‘50 అడుగుల దూరం పాటించండి’ అని రాసున్న విషయాన్ని మనం చూస్తూనే ఉంటాం. అధికారుల ప్రకారం, ఇలాంటి సూచనలు పాటించడం శ్రేయస్కరం. వాహనాల మధ్య తగినంత దూరం ఉన్నప్పుడు సడెన్ బ్రేక్ వేసినా పెద్ద ప్రమాదాలు జరగవు. లేకపోతే ముందున్న వాహనం అకస్మాత్తుగా ఆగితే వెనకున్న వాహనాలు దాన్ని ఢీకొట్టాల్సి వస్తుంది.
అయితే, చాలా సందర్భాల్లో వాహనాదారులు ఇలాంటి సూచనలు పాటించరు. ముందున్న వాహనానికి అతిసమీపాన వెళుతుంటారు. రాత్రి పూట ఇలా చేస్తే దారుణ ప్రమాదాలు జరుగుతాయి. ఈ పరిస్థితిని నివారించేందుకు జపాన్‌కు చెందిన ఓ డ్రైవర్ అద్భుత ఐడియా వేశాడు. ఇందులో భాగంగా అతడు తన వాహనం వెనక టాపుపై లేజర్ లైట్లు అమర్చాడు. దీంతో, ఈ లేజర్ వాహనం వెనక కొంత దూరంలో రోడ్డుపై పడింది. ఈ గీత దాటి రావద్దని మరింత స్పష్టంగా చెప్పేందుకు వీలుగా అతడు లేజర్ లైట్ వినియోగించాడు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రమాదాలు నివారించేందుకు ఈ ఏర్పాటు చేశాడు (Trunk drivers unique idea to prevent accidents).
ఈ డ్రైవరన్న ఐడియా జనాలకు బాగా నచ్చడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ టెక్నిక్ కారణంగా యాక్సిడెంట్లు దాదాపుగా ఉండవంటూ కొందరు వ్యాఖ్యానించారు. నిబంధనల అమలు విషయంలో డ్రైవర్ శ్రద్ధ చూసి మరికొందరు మురిసిపోయారు. వాహనదారుల్లో కనీసం సగం మంది అయినా నిబంధనల విషయంలో ఇలాంటి శ్రద్ధ చూపిస్తే ప్రయాణాలు సురక్షితంగా సాగుతాయని కామెంట్ చేశారు.