Viral Video: వామ్మో.. మెరుపు వేగం అంటే ఇదేనేమో.. పీతను తాబేలు ఎంత స్పీడ్‌గా తినేసిందో చూడండి..
ABN , Publish Date - Dec 12 , 2024 | 09:03 PM
చిరుతను వేగానికి చిరునామాగా భావిస్తారు. అలాగే తాబేలు అనగానే దాని నెమ్మదితనం గుర్తుకువస్తుంది. అయితే నడవడంలో తాబేలు నెమ్మదేమో గానీ, వేట విషయంలో మాత్రం మెరుపు వేగాన్ని ప్రదర్శిస్తుంది. తాబేలు వేటకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ప్రకృతిలో ఒక్కో జంతువుకు (Animal) ఒక్కో ప్రత్యేక లక్షణం ఉంటుంది. ప్రతి జంతువుకు బలం, బలహీనత ఉంటాయి. చిరుతను వేగానికి చిరునామాగా భావిస్తారు. అలాగే తాబేలు (Tortoise) అనగానే దాని నెమ్మదితనం గుర్తుకువస్తుంది. అయితే నడవడంలో తాబేలు నెమ్మదేమో గానీ, వేట విషయంలో మాత్రం మెరుపు వేగాన్ని ప్రదర్శిస్తుంది. తాబేలు వేటకు సంబంధించిన వీడియో (Tortoise Hunting Video) ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు (Viral Video).
@AMAZlNGNATURE అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ తాబేలు సముద్రపు ఒడ్డున నిశబ్దంగా కూర్చుని ఉంది. దాని ముందు నుంచి ఓ పీత (Crab) నెమ్మదిగా వెళ్తోంది. ఆ పీతను తాబేలు సైలెంట్‌గా గమనిస్తూ ఉండిపోయింది. ఆ పీత నోటి దగ్గరకు రాగానే ఆ తాబేలు మెరుపు వేగంతో దానిని మింగేసింది. పీతను మింగిన తర్వాత తాబేలు మళ్లీ సాధారణ స్థితికి వచ్చేసింది. అసలేం జరిగిందో అర్థం అయ్యేలోపు తాబేలుకు పీత ఆహారంగా మారిపోయింది. ఆ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఆ వీడియోను 6.3 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. 5.3 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``తాబేలు భీకర రూపాన్ని నేనెప్పుడూ చూడలేదు``, ``తాబేలు నిజంగా ఆ పీతను తినేసిందా``, ``ఆ పీతను తాబేలు దూరంగా విసిరేసినట్టు ఉంది``, ``ఇది నిజంగా అద్భుతం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: వామ్మో.. పచ్చి మిరప లిప్‌స్టిక్.. బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్ టిప్ చూస్తే మండిపోవడం ఖాయం..
Viral Video: ప్రమాదానికి హాయ్ చెప్పడం అంటే ఇదే.. రైలు గేటుకు వేలాడుతూ రీల్.. చివరకు ఆమె ఏమైందంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి