Share News

Viral Video: ప్రాణాల మీద ఆశ లేదా? కదులుతున్న లారీ వెనకాల స్కేటింగ్.. షాకింగ్ వీడియో వైరల్!

ABN , Publish Date - Aug 13 , 2024 | 08:42 AM

యుక్త వయసులో ఉండే వారు సహసాలు చేస్తుంటారు. థ్రిల్లింగ్ అనుభవాలను చవిచూడాలని అనుకుంటారు. అందుకోసం ప్రాణాంతక సాహసాలు చేస్తుంటారు. సోషల్ మీడియా, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వంటివి అందుబాటులోకి వచ్చాక ఈ ధోరణి మరింత పెరిగింది.

Viral Video: ప్రాణాల మీద ఆశ లేదా? కదులుతున్న లారీ వెనకాల స్కేటింగ్.. షాకింగ్ వీడియో వైరల్!
Skating behind moving Truck

యుక్త వయసులో ఉండే వారు సహసాలు (Adventurous) చేస్తుంటారు. థ్రిల్లింగ్ అనుభవాలను చవిచూడాలని అనుకుంటారు. అందుకోసం ప్రాణాంతక సాహసాలు (Dangerous Stunts) చేస్తుంటారు. సోషల్ మీడియా, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ (Reels) వంటివి అందుబాటులోకి వచ్చాక ఈ ధోరణి మరింత పెరిగింది. వ్యూస్, లైక్స్, పాపులారిటీ కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి సాహసాలు చేస్తున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే నివ్వెరపోవాల్సిందే. అత్యంత వేగంగా వెళుతున్న లారీ వెనకాల ఇద్దరు కుర్రాళ్లు రిస్కీ స్టంట్స్ చేశారు (Viral Video).


ఈ వీడియోను బంగ్లాదేశ్‌ (Bangladesh)లో చిత్రీకరించారు. ఢాకాలోని బిజోయ్ సరనీ మెట్రో స్టేషన్ సమీపంలో రద్దీగా ఉండే రహదారిపై ప్రమాదకర విన్యాసం చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఇద్దరు కుర్రాళ్లు స్కేటింగ్ షూస్ వేసుకుని, వేగంగా వెళుతున్న లారీని (Truck) పట్టుకున్నారు. రద్దీగా ఉన్న ఆ రహదారిపై ఆ లారీతో పాటు వేగంగా స్కేటింగ్ (Skating) చేశారు. ఆ తర్వాత ఓ కుర్రాడు లారీని వదిలేసి రోడ్డు మీదకు వచ్చి ఒంటి కాలితో స్కేటింగ్ చేశారు. వారి ట్యాలెంట్‌కు అందరూ ముగ్ధులయ్యారు. అలాగే అంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించినందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు.


@Nishantjournali అనే ట్విటర్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు 8 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను వీక్షించారు. దాదాపు 4 వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``వీళ్లు ఎంత ప్రతిభావంతులు. అలాగే ఎంత మూర్ఖులు``, ``ఒక అబ్బాయి అద్భుతమైన బ్యాలెన్స్, ప్రతిభను ప్రదర్శించాడు. అతడి ట్యాలెంట్‌ను ఉపయోగించుకోవాలి``, ``వీరి ట్యాలెంట్‌కు సరైన వేదిక దొరకాలి``, ``అనుకోనిది జరిగితే ఇంత ట్యాలెంట్ వృథాగా పోతుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Picture Puzzle: ఈ పజిల్ సాల్వ్ చేయడం అంత ఈజీ కాదు.. తేడాగా ఉన్న పులి మొహాన్ని 10 సెకెన్లలో కనిపెట్టండి..!


Viral: ``బై.. బై.. సర్``.. ఉద్యోగి పంపించిన రాజీనామా లెటర్ చూసి ఖంగుతున్న బాస్.. అసలు కథేంటంటే..!


Viral Video: పాము, మూడు ముంగిసల మధ్య భీకర ఫైట్.. రన్ వేపై పోరాడుకున్న బద్ధ శత్రువులు..!


Picture Puzzle: మీ కళ్లకు పరీక్ష.. ఈ రెండు ఫొటోల్లోని మూడు తేడాలను 10 సెకెన్లలో కనిపెట్టండి!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 13 , 2024 | 08:43 AM