Share News

Success story: ఇద్దరూ సివిల్స్ రాస్తే ఒక్కరే సెలెక్ట్ అయి ఐపీఎస్ అయ్యారు.. ఫెయిల్ అయిన ఆ రెండో వ్యక్తి ఏమయ్యారంటే..

ABN , Publish Date - Jun 14 , 2024 | 12:28 PM

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి హిమాన్షు త్యాగి తాజాగా ట్విటర్‌లో షేర్ చేసిన ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఐఐటీ ఢిల్లీకి చెందిన ఇద్దరు స్నేహితుల స్ఫూర్తిదాయక కథను ఆయన పంచుకున్నారు. ఐఐటీకి చెందిన ఆ ఇద్దరు స్నేహితులు సివిల్స్ పరీక్ష రాశారు.

Success story: ఇద్దరూ సివిల్స్ రాస్తే ఒక్కరే సెలెక్ట్ అయి ఐపీఎస్ అయ్యారు.. ఫెయిల్ అయిన ఆ రెండో వ్యక్తి ఏమయ్యారంటే..
Success story

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి హిమాన్షు త్యాగి (Himanshu Tyagi) తాజాగా ట్విటర్‌లో షేర్ చేసిన ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఐఐటీ ఢిల్లీకి (IIT Delhi) చెందిన ఇద్దరు స్నేహితుల స్ఫూర్తిదాయక కథను ఆయన పంచుకున్నారు. ఐఐటీకి చెందిన ఆ ఇద్దరు స్నేహితులు సివిల్స్ పరీక్ష (Civils Exam) రాశారు. ఆ ఇద్దరిలో ఒకరు పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఐపీఎస్ (IPS) అధికారి అయ్యారు. మరో వ్యక్తి పరీక్షలో ఫెయిల్ అయిపోయాడు. ఆ ఐపీఎస్ అధికారి ప్రస్తుతం రిటైర్ అయి ఫించన్ తీసుకుంటున్నాడు. ఆ పరీక్ష ఫెయిల్ అయిన వ్యక్తి ఏకంగా రూ.2 వేల కోట్లకు అధిపతి అయ్యాడు (Success story).


``సివిల్స్ పరీక్షకు పలు సార్లు సిద్ధమై రాసిన ఆ వ్యక్తి ఒక్కసారి కూడా ఉత్తీర్ణత సాధించలేకపోయాడు. దీంతో ఆ వ్యక్తి సివిల్స్ లక్ష్యాన్ని పక్కన పెట్టి ``ఐఐటీ జేఈఈ`` కోచింగ్ సెంటర్ (IIT JEE Coaching Center) ప్రారంభించాడు. ఆ కోచింగ్ సెంటర్‌లో శిక్షణ తీసుకున్న ఎంతో మంది సివిల్స్ పరీక్షను క్రాక్ చేశారు. దీంతో ఆ కోచింగ్ సెంటర్ చాలా బాగా వృద్ధి చెందింది. ప్రస్తుతం దేశంలోనే ప్రముఖ కోచింగ్ సెంటర్లలో ఒకటిగా ఉంది`` అని హిమాంశు తెలిపారు. ఎవరు విఫలమవుతారో, ఎవరు విజయం సాధిస్తారో కాలమే నిర్ణయిస్తుందని హిమాంశు ట్వీట్ చేశారు.


కాగా, ఈ ట్వీట్‌లో తను పేర్కొన్న ఆ ఇద్దరు స్నేహితుల వివరాలను మాత్రం హిమాంశు వెల్లడించలేదు. అయితే ఈ కథ పూర్తిగా నిజం అని మాత్రం ఆయన పేర్కొన్నారు. రెండ్రోజుల క్రితం హిమాంశు చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటివరకు 3.5 లక్షల మంది ఈ ట్వీట్‌ను వీక్షించారు. ఎంతో మంది తమ స్పందనలను తెలియజేశారు. ``సంపాదనను పక్కన పెడితే ఇద్దరూ విజేతలే``, ``ఒక దారి మూసుకుపోతే మరో దారి తెరుచుకుంటుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Puzzle: మీ ఐక్యూకు నిజమైన పరీక్ష.. ఈ ఫొటోలో ఉన్న ముగ్గురిలో ఎవరు రోగిగా నటిస్తున్నారో చెప్పండి..!


Viral Video: రీల్ చేద్దామనుకుని ఏనుగుకు దొరికిపోయాడు.. ఒక్క దెబ్బకు ప్రాణాలు కోల్పోయాడు.. వీడియో వైరల్!


మరన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 14 , 2024 | 12:28 PM