Viral: మహిళ సహనానికి పరీక్ష పెట్టిన ఉబెర్ డ్రైవర్! క్యాబ్ ఎక్కినప్పటి నుంచి..
ABN , Publish Date - Jun 21 , 2024 | 09:34 PM
ఉబెర్ డ్రైవర్ తీరుతో విసిగిపోయిన ఓ మహిళ తనకు తలపోటు వచ్చిందంటూ నెట్టింట పోస్టు పెట్టింది. ఇలాంటి డ్రైవర్ల తీరు మారేందుకు మార్గమేదైనా ఉందా అంటూ ఆమె నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఉబెర్ డ్రైవర్ తీరుతో విసిగిపోయిన ఓ మహిళ తనకు తలపోటు వచ్చిందంటూ నెట్టింట పోస్టు పెట్టింది. ఇలాంటి డ్రైవర్ల తీరు మారేందుకు మార్గమేదైనా ఉందా అంటూ ఆమె నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్ (Viral) అవుతోంది. దీనిపై స్పందించిన ఉబెర్ మహిళకు క్షమాపణలు కూడా చెప్పింది.
Viral: ఇలాంటోళ్లతో ఎప్పటికైనా రిస్కే! బాయ్‌ఫ్రెండ్ పొరపాటుతో తిక్కరేగి..
బెంగళూరుకు చెందిన షెఫ్ జూనీ టాన్ ఇటీవల ఉబెర్ క్యాబ్‌లో పర్యటించారు. అయితే, క్యాబ్ ఎక్కిన దగ్గర నుంచి డ్రైవర్ ఫోనులో ఆపకుండా మాట్లాడుతూ ఆమెకు విసుగుతెప్పించాడు. అతడి తీరుతో ఆమెకు తలనొప్పి వచ్చింది. ‘‘అతడు మాట్లాడుతూనే ఉన్నాడు. చివరకు నాకు తలనొప్పి వచ్చేసింది. ఇలాంటి డ్రైవర్లను మాట్లాడొద్దని డైరెక్టుగా అడిగేయొచ్చా. ఇందుకు సంబంధించి రూల్స్ ఏమైనా ఉన్నాయా? అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించింది (Uber Drivers Constant Phone Calls Gave Bengaluru Woman A Headache Company Apologises).
ఈ పోస్టుపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. ఫోన్ మాట్లాడొద్దని డ్రైవర్‌ను మర్యాదగా అడగొచ్చని, అయితే, వారు వింటారన్న నమ్మకం మాత్రం లేదని కొందరు చెప్పుకొచ్చారు. మరికొందరు మాత్రం యాప్‌లో ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉందని అన్నారు. మరోవైపు, ఈ ఉదంతంపై ఉబెర్ కూడా స్పందించింది. ఆమెకు ఇలాంటి పరిస్థితి ఎదురైనందుకు క్షమాపణలు చెప్పింది. సంస్థ డ్రైవర్లు ప్రొఫెషనల్‌గా ఉండాలని తాము ఆశిస్తామని ఉబెర్ చెప్పుకొచ్చింది. డ్రైవర్ పనితీరును సమీక్షించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పింది. భవిష్యత్తులో ఇలాంటి సమస్య ఎదురుకాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.