Share News

Viral News: లంచంగా బంగాళదుంపలు డిమాండ్ చేసిన సబ్ ఇన్‌స్పెక్టర్.. చివర్లో బిగ్ ట్విస్ట్

ABN , Publish Date - Aug 10 , 2024 | 06:10 PM

లంచంగా ఓ సబ్ ఇన్‌స్పెక్టర్ బంగాళదుంపలు డిమాండ్ చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చర్చనీయాంశం(Viral News) అవుతోంది. కానీ ఈ కేసులో బిగ్ ట్విస్ట్ పోలీసులను నివ్వెరపరిచింది.

Viral News: లంచంగా బంగాళదుంపలు డిమాండ్ చేసిన సబ్ ఇన్‌స్పెక్టర్.. చివర్లో బిగ్ ట్విస్ట్

లఖ్‌నవూ: లంచంగా ఓ సబ్ ఇన్‌స్పెక్టర్ బంగాళదుంపలు డిమాండ్ చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చర్చనీయాంశం(Viral News) అవుతోంది. కానీ ఈ కేసులో బిగ్ ట్విస్ట్ పోలీసులను నివ్వెరపరిచింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లంచంగా(Bribe) బంగాళదుంపలు డిమాండ్ చేసిన కారణంతో ఉత్తరప్రదేశ్‌లోని(Uttarpradesh) కన్నౌజ్‌లో విధులు నిర్వహిస్తున్న సబ్-ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేశారు. బంగాళదుంప అనే పదాన్ని లంచానికి కోడ్‌గా ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది.

ఇందుకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో(Social Media) వైరల్ అవుతోంది. సౌరిఖ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భావల్‌పూర్ చపున్నా చౌకీలో ఓ సబ్ ఇన్‌స్పెక్టర్ విధులు నిర్వహిస్తున్నాడు. భూమికి సంబంధించిన కేసులో తనకు న్యాయం చేయాలని ఓ రైతు సదరు పోలీసు అధికారిని ఫోన్లో సంప్రదించాడు. ఇందుకుగానూ పోలీసు 5 కిలోల బంగాళదుంపలు డిమాండ్ చేశాడు.


ఇక్కడ బంగాళ దుంపలు అంటే నగదు అని దర్యాప్తులో తేలింది. అంత మొత్తం ఇచ్చుకోలేనని చెప్పిన రైతు బదులుగా రెండు కిలోలు ఇస్తానని అన్నాడు. కోపం తెచ్చుకున్న సబ్ ఇన్‌స్పెక్టర్ తాను అడిగినంత ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేశాడు. రైతు చివరికి మూడు బంగాళదుంపలు ఇస్తానని ఒప్పుకున్నాడు. దానికి సబ్ ఇన్‌స్పెక్టర్ అంగీకరించాడు. అయితే రైతు సదరు పోలీస్ ఆఫీసర్ ఫోన్ సంభాషణను రికార్డు చేయడంతో అసలు విషయం బయటపడింది.

ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న కన్నౌజ్ ఎస్పీ అమిత్ కుమార్.. సబ్‌ఇన్‌స్పెక్టర్‌ని సస్పెండ్ చేశారు. ఈ కేసులో శాఖాపరమైన విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఆయన ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. కన్నౌజ్ సిటీ సర్కిల్ పోలీసు అధికారి కమలేష్ కుమార్‌కు కేసు దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం సబ్‌ఇన్‌స్పెక్టర్, రైతు ఆడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Updated Date - Aug 10 , 2024 | 06:10 PM