Share News

Viral Video: పెళ్లి భోజనాల్లో బిర్యానీలో చికెన్ లెగ్ పీస్ మిస్.. అంతే..

ABN , Publish Date - Jun 26 , 2024 | 08:39 PM

వివాహమంటేనే.. వధువు, వరుడు ఇరు కుటుంబాల్లో చాలా పనులుంటాయి. ముహుర్తం పెట్టిన నాటి నుంచి వివాహ వేడుక పూర్తయ్యే వరకు రెండు కుటుంబాలు క్షణం తీరిక లేకుండా బిజీ బిజీగా ఉంటాయి.

Viral Video: పెళ్లి భోజనాల్లో బిర్యానీలో చికెన్ లెగ్ పీస్ మిస్.. అంతే..

వివాహమంటేనే.. వధువు, వరుడు ఇరు కుటుంబాల్లో చాలా పనులుంటాయి. ముహుర్తం పెట్టిన నాటి నుంచి వివాహ వేడుక పూర్తయ్యే వరకు రెండు కుటుంబాలు క్షణం తీరిక లేకుండా బిజీ బిజీగా ఉంటాయి. ఇక పెళ్లి వేడుకకు వచ్చిన అతిథులకు అన్ని మర్యాదలు పద్దతిగా చేయాలి. అందులో ఎక్కడ, ఎవరికీ మర్యాదలు మాత్రం తగ్గకూడదు.

Also Read: కేజ్రీవాల్ మళ్లీ అరెస్ట్.. స్పందించిన సునీత


ఓ వేళ ఏమైనా కొద్దిగా మర్యాద తగ్గినా? ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అవి ఎలా ఉంటాయో తెలియాలంటే.. ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. అలాగే ఈ వీడియో చూడాల్సిందే. వివాహ వేడుకలో భాగంగా వడ్డించిన బిర్యానీలో చికెన్ లెగ్ పీస్ జస్ట్ మిస్ అయింది. అంతే పెళ్లి కొడుకు తరఫు వారు తమ నిరసన వ్యక్తం చేస్తూ.. వధువు వైపు వారిపై మాటల దాడికి దిగారు.

Also Read: Viral Video: లోక్‌సభ స్పీకర్ ఎన్నికల వేళ.. కలిసిన కంగనా రనౌత్, చిరాగ్ పాశ్వాన్


దీంతో వధువు తరఫు వారికి ఆగ్రహం కట్టలు తెంచుకొంది. దాంతో ఇరు వర్గాల వారు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ప్రారంభించారు. అలా వారి మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో ఇరు వర్గాలు ఒకరిని ఒకరు తోసుకోవడంతోపాటు కూర్చీలు విసురుకున్నారు. అక్కడితో ఆగకుండా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో వివాహ వేడుక కాస్తా రసాబాసగా మారింది.

Also Read: AP Politics: మాజీ సీఎం వైఎస్ జగన్‌కు రామచంద్రయ్య చురకలు


ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌, నవాబ్‌గంజ్‌లోని సర్తాజ్ మ్యారేజ్ హాల్‌లో ఇటీవల చోటు చేసుకుంది. అయితే పెళ్లి భోజనాల్లో బిర్యానీలో చికెన్ లెగ్ పీస్ మిస్ కావడం.. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలున్న ఈ వీడియో సోషల్ మీడియాను చుట్టేస్తుంది.

Also Read: Viral Video: కవితా మజాకా? ఓ చేతిలో పిల్లోడు.. మరో చేతిలో..?

Also Read: Hyderabad: పలు ప్రాంతాల్లో నేడు, రేపు నీటి సరఫరాకు అంతరాయం

For More National News and Latest Telugu News click here

Updated Date - Jun 26 , 2024 | 08:43 PM