Share News

Viral Video: రోడ్డు మధ్యలో కుర్చీ వేసుకుని కూర్చున్నాడు.. ఓ ట్రక్ ఏం చేసిందో చూడండి.. వీడియో వైరల్..

ABN , Publish Date - Sep 01 , 2024 | 08:51 PM

నిత్యం వాహనాల రాకపోకలతో బిజీగా ఉండే రోడ్డుపై నడవడమే కష్టం. రోడ్డు దాటడానికే చాలా అపసోపాలు పడాలి. అలాంటిది ఓ వ్యక్తి రోడ్డు మధ్యలో ప్లాస్టిక్ కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. అదీ రాత్రిపూట వర్షం పడుతున్న సమయంలో అలాంటి పిచ్చి పని చేశాడు.

Viral Video: రోడ్డు మధ్యలో కుర్చీ వేసుకుని కూర్చున్నాడు.. ఓ ట్రక్ ఏం చేసిందో చూడండి.. వీడియో వైరల్..
Truck accident

నిత్యం వాహనాల రాకపోకలతో బిజీగా ఉండే రోడ్డు (Road)పై నడవడమే కష్టం. రోడ్డు దాటడానికే చాలా అపసోపాలు పడాలి. అలాంటిది ఓ వ్యక్తి రోడ్డు మధ్యలో ప్లాస్టిక్ కుర్చీ (Chair) వేసుకుని కూర్చున్నాడు. అదీ రాత్రిపూట వర్షం పడుతున్న సమయంలో అలాంటి పిచ్చి పని చేశాడు. చాలా వాహనాలు అతడిని తప్పించుకుని పక్క నుంచి వెళ్లిపోయాయి. అయితే ఓ లారీ మాత్రం అతడికి తగిన శాస్తి చేసింది. దీంతో అతడు కింద పడిపోయాడు. అయితే పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) ప్రతాప్‌గఢ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను స్థానికులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి బ్లాక్ షార్ట్స్ వేసుకుని నడిరోడ్డుపై కూర్చున్నాడు. రాత్రి వేళ వర్షం పడుతున్న సమయంలో మతి స్థిమితం లేని వ్యక్తి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగించాడు. రోడ్డు మధ్యలో కూర్చున్న ఆ వ్యక్తిని ఎవరూ మందలించలేదు. వాహనాలన్నీ అతడిని తప్పించుకుని పక్క నుంచి వెళ్లిపోయాయి. అయితే ఓ ట్రక్ వేగంగా వచ్చింది. అతడిని చూసి డ్రైవర్ ట్రక్‌ను స్లో చేశాడు.


ఆ ట్రక్ డ్రైవర్ కూడా పక్క నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే ట్రక్ పక్క భాగం అతడు కూర్చున్న కుర్చీని లాగేసింది. దీంతో ఆ వ్యక్తి కిందపడిపోయాడు. ఇటు వైపు పడ్డాడు కాబట్టి పెద్దగా దెబ్బలేం తగల్లేదు. ఒకవేళ అటు వైపు పడి ఉంటే ట్రక్ చక్రాలు అతడిని నుజ్జు నుజ్జు చేసి ఉండేవి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు వేలల్లో వ్యూస్ వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి..

Picture Puzzle: ఈ పజిల్‌లో ``Hero``ను కనిపెడితే మీరు నిజమైన హీరోనే.. 5 సెకెన్లలో పూర్తి చేయండి!


Viral Video: ఆహా.. దర్జా అంటే ఇదీ.. కదులుతున్న లారీ వెనుక ఊయల కట్టుకుని ఎలా ఊగుతున్నాడో చూడండి..


Viral Video: ఏం తెలివి గురూ.. బైక్‌ను ఆటోలా మార్చి ఐదుగురిని తీసుకెళ్తున్నాడు.. జుగాడ్ వీడియో వైరల్..


Viral Video: అది చెయ్యా? ఉక్కు కడ్డీనా? ట్రాక్టర్ పైకి ఎక్కించుకుని ఆ వ్యక్తి చేసిన స్టంట్ చూస్తే షాకవ్వాల్సిందే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 01 , 2024 | 08:51 PM