Viral: భార్యపై అనుమానం.. పోలీసు ఉన్నతాధికారి ఏం చేశాడో తెలిస్తే..
ABN , Publish Date - Jun 27 , 2024 | 07:10 PM
భార్యపై నిఘాపెట్టేందుకు పోలీసు నిఘా వ్యవస్థను దుర్వినియోగం చేసిన ఓ పోలీసు ఉన్నతాధికారి చివరకు డిమోషన్‌కు గురయ్యాడు.
ఇంటర్నెట్ డెస్క్: భార్యపై నిఘాపెట్టేందుకు పోలీసు నిఘా వ్యవస్థను దుర్వినియోగం చేసిన ఓ పోలీసు ఉన్నతాధికారి చివరకు డిమోషన్‌కు గురయ్యాడు. అమెరికాలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనానికి (Viral) దారి తీసింది.
Viral: కిలాడీ జంట! చచ్చిన ఈగలతో వీళ్లేం చేస్తారో తెలిస్తే..
దక్షిణ కెరొలినాకు చెందిన రయాన్ టెర్రెల్ నార్త్ ఛార్ల్స్‌టన్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో లెఫ్టెనెంట్‌గా ఉండేవారు. తన భార్య మరో వ్యక్తితో సన్నిహితంగా ఉన్నట్టు ఆయనకు కొంతకాలం క్రితం అనుమానం కలిగింది. ఈ క్రమంలో ఆయన తన భార్యపై నిఘా పెట్టేందుకు పోలీసుల సర్వేలెన్స్ వ్యవస్థను దుర్వినియోగ పరిచారు. నగర సీసీటీవీ కెమెరా ఫుటేజీ ద్వారా భార్య కదలికలను పసిగట్టారు. చివరకు ఆయన అనుమానం నిజమైంది. ఆమె వివాహేతర సంబంధం నిజమే అని తేలింది.
ఆ తరువాత టెర్రెల్ విధి నిర్వహణలో భాగంగా తీవ్ర ఆగ్రహానికి గురి కావడం, కోలీగ్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో అనుమానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఉన్నతాధికారులు ఆరా తీయడంతో పోలీసుల నిఘా వ్యవస్థను దుర్వినియోగం చేసినట్టు తేలింది. దీంతో, వృత్తి నిబంధనలు ఉల్లంఘించిన టెర్రెల్‌ను మాస్టర్ పెట్రోల్ ఆఫీసర్‌గా డిమోట్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా, నిఘా వ్యవస్థను వినియోగించకుండా ఆంక్షలు విధించడమే కాకుండా ఆరు నెలల ప్రొబేషన్ కూడా విధించారు.
మరో ఘటనలో.. భార్యపై నిఘాపెట్టిన ఓ పోలీసు అధికారి చివరకు జైలు పాలయ్యాడు. హార్పర్ అనే అధికారి భార్య కూడా పోలీసుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె మరో అధికారితో సన్నిహితంగా ఉండటం హార్పర్ కంటపడింది. ఈ క్రమంలో వారిపై హార్పర్ దాడికి తెగబడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఇద్దరు పోలీసు ఆఫీసర్లు నిబంధనలకు వ్యతిరేకంగా సన్నిహితమయ్యారని నిరూపించేందుకు ప్రయత్నించినట్టు వెలుగులోకి వచ్చింది. అయితే, హార్పర్ దాడి చేశాడని జ్యూరీ నిర్ధారణకు రాలేకపోయింది. ఈ క్రమంలో అతడికి రెండేళ్ల జైలు శిక్ష పడింది. అంతేకాకుండా, పోలీసు శాఖ అతడిపై రెండేళ్ల సస్పెన్షన్ కూడా విధించింది.