Viral: పెట్టెలో దొరికిన రూ.85 లక్షలు! పోలీసులకు అప్పగిస్తే.. ఊహించని విధంగా..
ABN , Publish Date - Jun 03 , 2024 | 04:08 PM
మాగ్నెట్ ఫిషింగ్ చేసేందుకు వెళ్లి ఓ జంటకు ఏకంగా రూ. 85 లక్షలున్న పెట్టే లభించింది. దాన్ని పోలీసులకు అప్పగిస్తే వాళ్లు తిరిగి దంపతులకే ఇచ్చేశారు. అమెరికాలో ఈ ఘటన వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: మాగ్నెట్ ఫిషింగ్ చేసేందుకు వెళ్లిన ఓ జంటకు ఏకంగా రూ. 85 లక్షలున్న పెట్టే లభించింది. దాన్ని పోలీసులకు అప్పగిస్తే వాళ్లు తిరిగి దంపతులకే ఇచ్చేశారు. అమెరికాలో ఈ ఘటన వెలుగు చూసింది. ప్రస్తుతం ఈ ఉదంతం వైరల్ (Viral) అవుతోంది.
న్యూయార్క్ కు చెందిన జేమ్స్, బార్బీ దంపతులకు మాగ్నెట్ ఫిషింగ్ అంటే ఎంతో ఇష్టం. ఇందులో భాగంగా ఓ శక్తిమంతమైన అయస్కాంతానికి తాడుకట్టి సరస్సులు, కొలనులు వంటి జలాశయాల్లోకి వదులుతారు. నీటి అడుగున ఉన్న ఇనుప వస్తువులను అయస్కాంతం సాయంతో బయటకు తీస్తారు. ఇటీవల స్థానికంగా ఉన్న ఓ సర్సులో మాగ్నెట్ ఫిషింగ్ చేస్తుండగా వారికి ఓ పెట్టె దొరికింది. అందులో దాదాపు లక్ష డాలర్లు కనిపించాయి. దీంతో, వారు ఆ డబ్బును పోలీసులకు అప్పగించారు (US couple finds safe with 100,000 while fishing cops let them keep it ).
Viral: బాస్ తనని తెగ తిడుతున్నాడని ఈ యువతి ఏం చేసిందంటే..
అయితే, ఆ డబ్బుకు యజమానులు ఎవరో పోలీసులు గుర్తించలేకపోయారు. ఆ పెట్టే ఎవరి ఐడీ కనిపించలేదు. అంతేకాకుండా, ఆ డబ్బు ఏ నేరంతో ముడిపడి లేదన్న విషయాన్ని కూడా పోలీసులు నిర్ధారించారు. దీంతో, ఆ పెట్టెను జేమ్స్ దంపతులకే తిరిగిచ్చేశాడు.
అయితే, నోట్లకట్టలన్నీ తడిసిపోయాయని బేమ్స్ దంపతులు తెలిపారు. తమకు గతంలోనే మాగ్నె్ట్ ఫిషింగ్ సందర్భంగా అనేక ఇతర వస్తువులు దొరికాయన్నారు. ఓసారి రెండవ ప్రపంచయుద్ధం నాటి గ్రెనేడ్ దొరికిందని చెప్పాడు. మరో సందర్భంలో పాతకాలం నాటి సైకిలు, బైకు దొరికిందన్నారు.