Viral: ``థాంక్యూ సర్`` అనడమే ఆమె చేసిన తప్పు.. ఏకంగా విమానం నుంచి దించేసిన సిబ్బంది.. అసలేం జరిగిందంటే..
ABN , Publish Date - Jun 28 , 2024 | 02:10 PM
అమెరికాలో ఓ మహిళ చేసిన చిన్న పొరపాటు ఆమెకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఏకంగా ఆమె విమాన ప్రయాణం రద్దేయ్యే పరిస్థితి ఎదురైంది. ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన తన అనుభవాన్ని వింటే ఎవరైనా షాక్ అవక తప్పదు.
అమెరికా (America)లో ఓ మహిళ చేసిన చిన్న పొరపాటు ఆమెకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఏకంగా ఆమె విమాన ప్రయాణం (Flight journey) రద్దేయ్యే పరిస్థితి ఎదురైంది. ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన తన అనుభవాన్ని వింటే ఎవరైనా షాక్ అవక తప్పదు. విమానంలో పని చేస్తున్న మహిళా అటెండెంట్ (Flight attendant)ను పొరపాటును పురుషుడిగా భావించి ``సర్`` అన్నందుకు ఆమెను విమానం నుంచి దించేశారు. యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు (United Airlines) చెందిన విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన జెన్నా లాంగోరియా అనే మహిళ శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఆస్టిన్ వెళ్లేందుకు విమానాశ్రయానికి వెళ్లింది. విమానం ఎక్కే సమయంలో బోర్డింగ్ పాస్ ఇచ్చిన సిబ్బందికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో జెన్నా గందరగోళానికి గురైంది. మహిళా అటెండెంట్‌ను పురుషుడిగా భావించి ``థాంక్యూ సర్`` (Thank you, sir) అని చెప్పింది. దీంతో ఆ మహిళా సిబ్బంది ఆగ్రహానికి గురైంది. జెన్నాతో పాటు ఆమె తల్లిని, కుమారుడిని విమానంలోకి వెళ్లకుండా అడ్డుకుంది. ఎంత బతిమాలినా వినిపించుకోలేదు.
అప్పటికీ ఆ అటెండెంట్ మహిళ అనే సంగతిని జెన్నా గుర్తించలేదు. ఆ అటెండెంట్ తమను ఆపేశాడంటూ మరో వ్యక్తికి జెన్నా కంప్లైంట్ చేసింది. అప్పుడు ఆ వ్యక్తి ``ఆయన కాదు.. ఆమె`` అని సరి చేశారు. అప్పుడు తన తప్పు తెలుసుకున్న జెన్నా ఆ మహిళా అంటెండెంట్‌కు క్షమాపణ చెప్పేందుకు ప్రయత్నించింది. అయినా ఆమె వినిపించుకోకుండా విమానం ఎక్కేందుకు అనుమతించలేదు. తన బాధను జెన్నా సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.
ఇవి కూడా చదవండి..
Viral Video: అధిక తెలివితేటలంటే ఇవే.. ఈ ఫ్యాన్‌ను ఆపాలంటే కరెంట్ పోవాల్సిందే..షాకవుతున్న నెటిజన్లు!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..