Rose Day 2024: వాలెంటైన్స్ డే కి గులాబీలకు ఏంటి సంబంధం..!

ABN , First Publish Date - 2024-02-07T11:16:56+05:30 IST

ప్రేమను తెలిపే విషయంగా రోజ్ డే చాలా ముఖ్యమైనది. గులాబీలు వేర్వేరు రంగులలో ఉంటాయి. ఈ రంగులలో చాలా వాటికి చాలా అర్థాలు కూడా ఉన్నాయి.

Rose Day 2024: వాలెంటైన్స్ డే కి గులాబీలకు ఏంటి సంబంధం..!
Rose Day 2024

వాలెంటైన్స్ డే ప్రేమికులకు చాలా ప్రత్యేకమైన రోజు. ఫిబ్రవరి 14 కు వారం ముందు నించే.. వాలెంటైన్స్ డే సెలబ్రెషన్స్ జరుపుకుంటారు. అందులో భాగంగా జరిగే రోజ్ డేకు చాలా ప్రత్యేకత ఉంది. ప్రేమకు చిహ్నంగా భావించే గులాబీలను ప్రత్యేకించి గుర్తుచేసుకునే రోజు కూడా ఇదే. అసలు ప్రేమికుల రోజులో గులాబీలను ప్రత్యేకంగా చూడటానికి కారణాలు తెలుసుకుందాం.

రోజ్ డే 2024..

ప్రేమ, స్నేహానికి చిహ్నంగా గులాబీలను మార్చుకునే సంప్రదాయం పురాతన కాలం నుంచి వస్తున్నదే. ప్రత్యేకించి వాలెంటైన్స్ వీక్ లో భాగంగా ఇవి స్థానం సంపాదించుకున్నాయి. వాలెంటైన్స్ డే కి ముందున్న వారం చాలా వరకూ ప్రేమకు, కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేయడంలో గులాబీలు భాగం అయ్యాయి.

రోజ్ డే ప్రాముఖ్యత..

ప్రేమను తెలిపే విషయంగా రోజ్ డే చాలా ముఖ్యమైనది. గులాబీలు వేర్వేరు రంగులలో ఉంటాయి. ఈ రంగులలో చాలా వాటికి చాలా అర్థాలు కూడా ఉన్నాయి. భావోద్వేగాలను కమ్యూనికేట్ చేయడానికి వాటిని చాలా వరకూ ఉపయోగిస్తారు. ఎరుపు గులాబీలు తీవ్రమైన ప్రేమ, అభిరుచిని సూచిస్తాయి. పనుపు గులాబీలు స్నేహానికి చిహ్నంగా చెబుతారు. ఆనందాన్ని కూడా సూచిస్తాయి. తెల్ల గులాబీలు స్వచ్ఛతకుస అమాయకత్వానికి సూచికలు.. అలాగే గులాబీ రంగు గులాబీలు కృతజ్ఞతకు, ప్రశంసలకు ప్రతీకగా ఇస్తారు. అయితే గులాబీ రంగును ఎంచుకోవడం వలన భావోద్వేగాలను వ్యక్తపరిచే విధానం తెలుస్తుంది.

ఇది కూడా చదవండి: టాన్సిలిటిస్ కారణంగా నోరు పొడిబారినట్లయితే.. హోం రెమిడీస్‌తో ఇలా చేయండి..!


గులాబీలు వివిధ రంగులలో ఉంటాయి. ప్రతి రంగుకూ దాని ప్రత్యేక అర్థాన్ని కలిగి ఉంటాయి. ప్రతి రంగు వెనుక ఉన్న మీనింగ్ అర్థం చేసుకోవడం భావోద్వేగాలను ప్రభావంతంగా తెలియజేయడంలో సహాయపడతాయి.

ఎర్ర గులాబీలు.. ప్రేమకు చిహ్నాలు.

ఎర్రని గులాబీతో ప్రేమను వ్యక్తపరచవచ్చు. లోతైన ప్రేమను చెప్పేటప్పుడు, ఎప్పటికీ నీ మీద ప్రేమ ఇలానే ఉంటుందని చెప్పేందుకు వాలెంటైన్స్ డే వంటి ప్రత్యేక సందర్భాల్లో గులాబీలను ఇవ్వడం అలవాటుగా మారింది.

పింక్ గులాబీలు.. ప్రశంస, కృతజ్ఞత..

పింక్ గులాబీలు కృతజ్ఞత, ప్రశంసలను తెలిపేందుకు ఉపయోగిస్తారు. వీటిని ప్రేమికులు, స్నేహితులు ఇద్దరూ కలిపి ఇచ్చుకోవచ్చు. శృంగార ఆసక్తి కలిగిందని చిన్నగా చెప్పేందుకు తన పార్టనర్ కి ఈ గులాబీతో చెబుతారు. గులాబీ రంగు సౌమ్యత, గాంభీర్యం, ప్రేమకు చిహ్నం.

తెల్ల గులాబీలు.. స్వచ్ఛత, అమాయకత్వం..

తెల్ల గులాబీలు స్వచ్ఛత, అమాయకత్వం పెళ్ళిలో పుష్పగుచ్ఛాలు ఇచ్చుకోవడం, తెల్లని గులాబీలు సానుభూతిని వ్యక్తం చేయడానికి, జ్ఞాపకార్థంగా ఇచ్చుకునేందుకు ఇలా చాలా వాటికి తెలుపు పువ్వు నప్పేస్తుంది.

Updated Date - 2024-02-07T11:28:10+05:30 IST