Viral Video: తెలివితేటలు ఉంటే.. మారుతీ కారు మినీ థార్లా మారిపోతుంది.. వీడియో చూస్తే అవాక్కవ్వాల్సిందే..
ABN , Publish Date - Nov 17 , 2024 | 02:18 PM
కొందరు పోస్ట్ చేసే జుగాడ్ వీడియోలు చాలా మందిని అలరిస్తున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు నెట్టింట హల్చల్ చేశాయి. తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మారుతీ కారు మినీ థార్లా మారిపోయి రోడ్డు మీద పరుగులు పెడుతోంది. ఆ వీడియో చూసిన చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.
సోషల్ మీడియా ద్వారా ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని సృజనాత్మకంగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా కొందరు పోస్ట్ చేసే జుగాడ్ వీడియోలు (Jugaad Videos) చాలా మందిని అలరిస్తున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు నెట్టింట హల్చల్ చేశాయి. తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మారుతీ కారు (Wagon R) మినీ థార్లా (Mahindra Thar) మారిపోయి రోడ్డు మీద పరుగులు పెడుతోంది. ఆ వీడియో చూసిన చాలా మంది ఆశ్చర్యపోతున్నారు (Vira Video).
nimmy_vlogs అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఈ వీడియో షేర్ అయింది. మహీంద్రా థార్ కొత్త కారుకు చాలా డిమాండ్ ఉంది. దాని లుక్స్, స్టైల్ కారణంగా చాలా మంది దానిని ఇష్టపడుతున్నారు. అయితే థార్ కొనాలంటే ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది. అందుకే హర్యానాకు (Haryana) చెందిన ఒక వ్యక్తి దానికి వెరైటీ పరిష్కారం కనుగొన్నాడు. ఆ వ్యక్తి తన మారుతీ వ్యాగన్ ఆర్ కారుకు థార్ రూపం ఇచ్చాడు. వ్యాగన్ ఆర్ కారుకు థార్ బాడీని ఇన్స్టాల్ చేశాడు. చక్కగా రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నాడు. రోడ్డు మీద ఆ వెరైటీ వాహనాన్ని చూసిన చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఈ వైరల్ వీడియోను దాదాపు 10 లక్షల మంది వీక్షించారు. దాదాపు 80 వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇది వ్యాగన్ థార్``, ``భారతీయులు ఏమైనా చేయగలరు``, ``ఆనంద్ మహీంద్రా కూడా షాకవుతారేమో``, ``ఎన్ని డబ్బులు ఆదా చేశావు సోదరా`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: తప్పక చూడాల్సిన వీడియో.. మంచు మీద లావా ప్రవహిస్తుంటే ఎలా ఉందో చూడండి..
Viral Video: ఇదేందయ్యా ఇదీ.. నిజమా? మాయా?.. కీ బోర్డ్తో కారును ఎలా కంట్రోల్ చేస్తున్నాడో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి