Share News

Viral News: ఓరి మీ దుంపతెగ.. గర్ల్‌ఫ్రెండ్ కోసం ఎంతకు తెగించార్రా

ABN , Publish Date - Oct 11 , 2024 | 07:32 PM

స్నేహితుడి గర్ల్‌ఫ్రెండ్ కోసం త్యాగాలు చేసే వారిని సినిమాల్లోనే చూసి ఉంటాం. అలాంటి ఘటన ఒకటి నిజజీవితంలో జరిగింది. తన గర్ల్‌ఫ్రెండ్ ఆశ తీర్చాలనుకున్నాడు ఓ ప్రియుడు. ఆమెకు కొత్త కార్లో షికారుకు వెళ్లాలని ఉన్నట్లు తెలిసి.. డోంట్ వర్రీ అంటూ అతని స్నేహితులు అభయ హస్తం ఇచ్చారు.

Viral News: ఓరి మీ దుంపతెగ.. గర్ల్‌ఫ్రెండ్ కోసం ఎంతకు తెగించార్రా

నోయిడా: స్నేహితుడి గర్ల్‌ఫ్రెండ్ కోసం త్యాగాలు చేసే వారిని సినిమాల్లోనే చూసి ఉంటాం. అలాంటి ఘటన ఒకటి నిజజీవితంలో జరిగింది. తన గర్ల్‌ఫ్రెండ్ ఆశ తీర్చాలనుకున్నాడు ఓ ప్రియుడు. ఆమెకు కొత్త కార్లో షికారుకు వెళ్లాలని ఉన్నట్లు తెలిసి.. డోంట్ వర్రీ అంటూ అతని స్నేహితులు అభయ హస్తం ఇచ్చారు. ఇందుకోసం కార్‌నే దొంగతనం చేయాలనుకోవడం గమనార్హం. నవ్వు తెప్పించే ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం నోయిడాలోని ఓ యూనివర్సిటీలో ముగ్గురు విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో ఒకరు తన గర్ల్ ఫ్రెండ్‌కు కార్లో తిరగాలని ఉందని ఇద్దరు మిత్రులతో చెప్పారు. అతనికి సాయం చేయడానికి స్నేహితులు సిద్ధమయ్యారు. శ్రేయ్, అనికేత్ నగర్, దీపాంశు భాటి ముగ్గురూ కలిసి గ్రేటర్ నోయిడాలోని ఓ షోరూం నుంచి కారును దొంగిలించాలని పతకం పన్నారు. అయితే ఎవరు ఎవరికి సాయం చేయాలనుకున్నారో పోలీసులు స్పష్టంగా చెప్పలేదు.


అలా.. సెప్టెంబర్ 26న, గ్రేటర్ నోయిడాలోని కార్ బజార్‌లో పార్క్ చేసిన హ్యుందాయ్ వెన్యూని టెస్ట్ డ్రైవ్ చేస్తామని వారు షోరూం సిబ్బందితో అన్నారు. అనంతరం ఒకరు కారు డ్రైవ్ చేస్తుండగా.. మరో ఇద్దరు షోరూం మెయిన్ గేట్ వద్ద నిలబడ్డారు. అనంతరం వారిద్దరు కూడా కార్లో ఎక్కేశారు. అక్కడ పని చేస్తున్న సిబ్బంది వారిని గమనించేలోపే పరారయ్యారు. నిందితులు కారులో ఎక్కి, పారిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ సాయంతో నిందితులను పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గర్ల్‌ఫ్రెండ్ కోసం కారు చోరీ చేయడం స్థానికంగా చర్చనీయాంశం అయింది.

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు చెరువులు బాగుపడిందెలా?

ఇదికూడా చదవండి: Yadagirigutta: దసరా నుంచి స్వర్ణతాపడం పనులు

ఇదికూడా చదవండి: Hyderabad: అది పరిహారం కాదు.. పరిహాసం: కేటీఆర్‌

ఇదికూడా చదవండి: Manda krishna: వర్గీకరణ తర్వాతే నోటిఫికేషన్లు ఇవ్వాలి

Read Latest Telangana News and National News

Updated Date - Oct 11 , 2024 | 07:37 PM