Viral Video: అత్యంత అరుదైన వీడియో.. నదిలో ప్రవహిస్తున్న మంచుపై ఎలా వెళ్తున్నాడో చూడండి..
ABN , Publish Date - Jan 02 , 2024 | 12:47 PM
ప్రకృతిలోని అద్భుతాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాంటి వీడియోల్లో కొన్ని చూసిన వారిని ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. ప్రకృతి దశ్యాలకు పెట్టింది పేరైన లడఖ్‌లోని ఓ వీడియో తాజాగా చాలా మందిని ఆకట్టుకుంటోంది.
ప్రకృతిలోని (Nature) అద్భుతాలకు సంబంధించిన వీడియోలు (Nature Videos) ప్రస్తుతం తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాంటి వీడియోల్లో కొన్ని చూసిన వారిని ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. ప్రకృతి దశ్యాలకు పెట్టింది పేరైన లడఖ్‌లోని (Ladakh) ఓ వీడియో తాజాగా చాలా మందిని ఆకట్టుకుంటోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి నదిలోని (River) భారీ మంచు గడ్డపై (Thin Ice) నిల్చుని ప్రయాణిస్తున్నాడు.
Siddharth Bakaria అనే ట్విటర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేసి ``లడఖ్‌లోని జన్‌స్కర్‌లో ఇలాంటి సాహసం చేయాలని ఎవరు అనుకుంటున్నారు`` అంటూ కామెంట్ చేశారు. ఆ వీడియోలో నదిలో తేలుతూ వెళుతున్న భారీ మంచు గడ్డపై ఓ వ్యక్తి నిల్చుని ప్రయాణిస్తున్నాడు. ఆ రమణీయమైన దృశ్యానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోటి మందికి పైగా ఆ వీడియోను వీక్షించారు.
55 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``అద్భుతమైన వీడియో, నాకూ అలా చేయాలని ఉంది``, ``ఒళ్లు గగుర్పొడిచే సాహసం``, ``ఐస్ విరిగిపోతే మాత్రం చాలా పెద్ద ప్రమాదం సంభవిస్తుంది``, ``భద్రతాపరంగా తీసుకున్న చర్యలు ఏంటి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.