Viral: కొండచిలువతో కలిసి మెట్రోలో ప్రయాణం! షాకింగ్ వీడియో!
ABN , Publish Date - Jun 13 , 2024 | 07:38 PM
రద్దీగా ఉన్న మెట్రోలో ఓ ప్రయాణికుడు కొండచిలువతో ప్రయాణిస్తున్న వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఈ వీడియో చూసి జనాలు షాకైపోతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: పాము పేరు చెబితే వణికిపోయే వాళ్లు కోకొల్లలు. అయితే, కొందరు మాత్రం దుస్సాహసంగా పాములను పెంచుకుంటూ ఉంటారు. అక్కడితో ఆగకుండా తాము ఎక్కడికి వెళ్లినా వాటిని తమ వెంట తీసుకుని వెళుతుంటారు. అయితే, ఇలాంటి ప్రమాదకర జంతువుతో ఓ వ్యక్తి ఏకంగా మెట్రోలో ప్రయాణించాడు. ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ గా (Viral) మారింది.
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఆ వ్యక్తి కొండచిలువను ఏకంగా తన ఒళ్లో కూర్చోపెట్టుకుని ప్రయాణించాడు. పాము ఏమో మెల్లగా కదులుతూ ఆ వ్యక్తి వైపు కదిలింది. పామును చూసి ఇతర ప్రయాణికులు పట్టించుకోకపోయినా ఓ మహిళ మాత్రం వణికిపోయింది. పాము తనపై ఎక్కడ దాడి చేస్తుందో అన్న భయంలో ఉన్న ఆమె కనీసం రెప్ప వేసేందుకు కూడా సాహసించలేదు. చలనమనేదే లేకుండా రాయిలా బిగుసుకుపోయింది (Video Of Man Carrying Pythons In Crowded Metro Will Send Chills Down Your Spine).
Viral: ఏనుగు హింట్ ఇస్తున్నా వినలేదు.. చివరకు ఇతడికి ఎలాంటి గతి పట్టిందంటే..
ఈ వీడియో నెట్టింట కాలుపెట్టగానే వైరల్ అయిపోయింది. జనాలు పెద్ద ఎత్తున స్పందించారు. ఇలాంటి ప్రమాదకర జంతువులను ప్రజారవాణా వ్యవస్థల ద్వారా తరలించడం చట్టవ్యతిరేకమని కొందరు అన్నారు. ఇలాంటి వారు తాము ప్రమాదంలో పడుతూ ఇతరులనూ అపాయంలోకి నెట్టేస్తారని అన్నారు. కొందరికి మాత్రం మెట్రోలో ప్రయాణికుల తీరు అస్సలు అర్థం కాలేదు. మహిళ తప్ప మిగతావారందరూ పామును పెద్దగా పట్టించుకోకపోవడం అనేక మందిని ఆశ్చర్యపరిచింది. అంత పెద్ద పాము తమ మధ్యనే ఉన్నా జనాలు తమకేం పట్టనట్టుగా ఎలా ప్రయాణిస్తున్నారని కొందరు ప్రశ్నించారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియోకు రెండు కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. మరి ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.