Viral: మీ ఇంట్లో స్ప్లిట్ ఏసీ ఉందా? అయితే ఎలర్ట్.. ఈ వీడియో చూస్తే..
ABN , Publish Date - May 30 , 2024 | 07:20 PM
ఎండాకాలంలో ఏసీ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఏం జరుగుతుందో చెప్పే ఓ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీన్ని చూసి జనాలు షాకైపోతున్నారు. స్టెబిలైజర్లు వాడాలని, ఔట్ డోర్ యూనిట్ పై ఎండ నేరుగా తాకకుండా ఉంటే మంచిదని చెప్పారు.
ఇంటర్నె్ట్ డెస్క్: ఎండాకాలం తీవ్రత నానాటికీ పెరుగుతోంది. ఏసీలు వినియోగించాల్సిన తప్పనిసరి పరిస్థితి వచ్చి పడింది. అనేక మంది ఇళ్లల్లో ఇప్పుడు ఏసీలు దర్శనమిస్తున్నాయి. కానీ ఏసీల విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి మన పొరపాటు లేకపోయినా సమస్యలు ఎదురు కావచ్చు. అలాంటి ఓ వీడియో నెట్టింట వైరల్ గా (Viral) మారింది. ఏసీ వాడేవారందరూ ఈ వీడియో చూసి షాకైపోతున్నారు. అసలు ఏం జరిగిందంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, స్ప్లిట్ ఏసీ ఔట్ డోర్ యూనిట్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దారుణంగా మంటలు చెలరేగాయి. ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్న తరుణంలో ఏసీ మంటల్లో చిక్కుకోవడం కలకలానికి దారి తీసింది. పంజాబ్ లోని రోపార్ లో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.
Viral: ఈ వైరస్ ఎయిర్ పోర్టులోనూ కాలుపెట్టింది.. ప్రధాని కల్పించుకోకతప్పదు.. వైరల్ వీడియో
ఘటనకు కారణమేంటో తెలియరాలేదు కానీ.. స్టెబిలైజర్ లేకపోవడం వల్ల మంటలు చెలరేగినట్టు వీడియోలో ఓ వ్యక్తి అనడం మనం స్పష్టంగా వనిచ్చు. ఓట్ డోర్ యూనిట్ నీడలో ఏర్పాటు చేయకపోవడమే ఈ పరిస్థితికి కారణమై ఉండొచ్చని కొందరు అన్నారు. ఎక్కువ సేపు ఏసీ వాడటంతో ఇలా జరిగి ఉండొచ్చని అనుమానం కూడా వీడియోలో వ్యక్తమైంది (Video of outdoor AC unit on fire surfaces amid heatwave reports).
అయితే, వీడియో చూసిన వారందరూ ఏసీ విషయంలో అనే జాగ్రత్తలు తీసుకోవాలని కామెంట్ చేశారు. స్టెబిలైజర్లు వాడటం తప్పనిసరి అని అన్నారు. ఔట్ డోర్ యూనిట్ పై నేరుగా ఎండట పడకుండా చూసుకోవాలని కొందరు అన్నారు. ఏసీ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.