Viral: ఇదేం ఎనర్జీ బాబోయ్.. నడుము వంగని వయసులో ఈ 80ఏళ్ళ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కసరత్తులు చూస్తే..!
ABN , Publish Date - Jan 05 , 2024 | 02:36 PM
80ఏళ్ళ ఐపీఎస్ అధికారి కుర్రాళ్లకు ధీటుగా జిమ్ లో చేస్తున్న కసరత్తులు చూస్తే దిమ్మతిరిగిపోతుంది.
ప్రేమకు వయసు అడ్డు కాదు అని డైలాగులు చెబుతుంటారు. మనసు ఎంత ఉత్సాహంగా ఉన్నా సరే 60ఏళ్లు దాటాయటే ఫిట్నెస్ క్రమంగా తగ్గిపోతుంది. ఆరోగ్యకరమైన ఆహారం, తగినంత వ్యాయామం ఉంటే కాస్తో కూస్తో చురుగ్గా ఉండచ్చు. కానీ 80ఏళ్ళ ఐపీఎస్ అధికారి మాత్రం కుర్రాళ్లకు ధీటుగా జిమ్ లో కసరత్తులు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..
వయసు పెరిగినా సరే కొందరు పెద్దవాళ్లు చాలా ఉత్సాహంగా ఉంటారు. వారి శరీరం కూడా దృఢంగా ఉంటుంది. రిటైర్డ్ ఐపీఎస్ అదికారి ఎల్ సి అమర్నాథన్(Retired IPS LC Amarnathan) కూడా అలాంటి వ్యక్తే. ఈయన వయసు 80ఏళ్లు. కానీ జిమ్ లో కుర్రాడిలా ఎంతో ఉత్సాహంగా వర్కౌట్స్ చేస్తున్నారు. ఈయన జిమ్ లో బెంచ్ ప్రెస్, డంబెల్స్ వర్కౌట్స్, యాబ్ మూమెంట్స్ చేస్తున్న పోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: టీనేజ్ పిల్లల విషయంలో తల్లిదండ్రులు చేసే బిగ్ మిస్టేక్స్ ఇవే..!
రిటైర్డ్ ఐపీఎస్ అమర్నాథన్ వర్కౌట్స్ చేస్తున్న ఫోటోలను ఐపీఎస్ అథికారి అరుణ్ బోత్రా(IPS Arun Bothra) తన ట్విట్టర్ ఎక్స్(Twitter X) అకౌంట్ లో షేర్ చేశారు. ఈ ఫోటోలను చూసిన ఢిల్లీ పోలీస్ లో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి హరేంద్ర కె సింగ్ స్పందించారు. 'మనందరం ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండటానికి ప్రయత్నించాలి. ఇదే నిజమైన రీ-టైర్' అని అన్నారు. నెటిజన్లు కూడా ఈ ఫోటోలు చూసి ఆశ్తర్యపోతున్నారు. రిటైర్డ్ ఐపీఎస్ అమర్నాథ్ మీద ప్రశంసల వర్షం కురిపిస్తారు. ఆరోగ్యంగా ఉండటానికి అందరూ ప్రయత్నించాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: బెండకాయల గురించి మీకు తెలియని షాకింగ్ నిజాలివి!
మరిన్ని వైరల్ వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.