Share News

Video Viral: వీడెవడండీబాబు.. వినాయకుడి చేతిలో లడ్డూ ఎత్తుకెళ్లాడు..

ABN , Publish Date - Sep 08 , 2024 | 05:03 PM

వినాయక చవితి వచ్చిందంటే.. దేశంలో ఏమో కానీ.. తెలంగాణలో అదీ హైదరాబాద్‌ నగర శివారులో గణపతి లడ్డూ వేలం పాటలో రూ. లక్షల ధర పలుకుతుంది. బాలాపూర్ లడ్డూనే అందుకు అత్యుత్తమ ఉదాహరణ.

Video Viral: వీడెవడండీబాబు.. వినాయకుడి చేతిలో లడ్డూ ఎత్తుకెళ్లాడు..

వినాయక చవితి వచ్చిందంటే.. దేశంలో ఏమో కానీ.. తెలంగాణలో అదీ హైదరాబాద్‌ నగర శివారులో గణపతి లడ్డూ వేలం పాటలో రూ. లక్షల ధర పలుకుతుంది. బాలాపూర్ లడ్డూనే అందుకు అత్యుత్తమ ఉదాహరణ. గత కొన్నేళ్లుగా గణపతి నవరాత్రుల వేడుకల్లో బాలాపూర్ లడ్డూ ధర ఏడాదికేడాదికి.. పొంతన లేని ధరలో అంతకంతకు పెరుగుతొంది. దీంతో అందరి దృష్టి ఈ బాలాపూర్ లడ్డూపై పండింది. ఈ ఏడాది ఈ లడ్డూ ధర ఎంత పలుకుతుందోనని తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నారు.


లడ్డూ వేలం పాట..

ఇక ఇలా వేలంపాటలో ఆ లడ్డూ దక్కించుకున్న వారు సైతం విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. విఘ్నాలు తొలగించే ఆ దేవుడు చేతిలోని లడ్డూ దక్కించుకుంటే.. తమ భవిష్యత్తు బాగుంటుందని నమ్మకంతో కొనుగోలు చేస్తున్నట్లు వారంతా ఇప్పటికే మీడియా ఎదుట ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలా వేలంపాటలో లడ్డూలు కొనుగోలు చేసిన వారి మాటలపై ఓ దొంగకు బాగా గురి కదిరినట్లు ఉంది. అందుకే వినాయక చవితి వేళ.. భారీ వినాయకుడి చేతిలో పెద్ద సైజ్ బందరు లడ్డును ఇలా వచ్చి.. అలా దొంగిలించి.. అలా అలా నడుచుకొంటు వెళ్లిపోయాడు.


బాచుపల్లి ప్రగతి నగర్‌లో..

ఈ ఘటన శనివారం అర్థరాత్రి హైదరాబాద్‌ నగర శివారులోని బాచుపల్లి ప్రగతి నగర్ కాలనీలో ఓ అపార్‌మెంట్‌లో చోటు చేసుకుంది. వినాయక చవితి సందర్భంగా నిన్న రాత్రి బాగా పొద్దు పోయే వరకు ఆ అపార్ట్‌మెంట్‌ వాసులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఆదివారం ఉదయం గణపతి విగ్రహానికి ఆరాధన చేసేందుకు అపార్ట్‌మెంట్ వాసులు కిందకి దిగారు. తీరా చూస్తే వినాయకుడి చేతిలోని లడ్డూ మాత్రం మాయమైంది.


సీసీ ఫుటేజ్...

ఈ విషయాన్ని గమనించిన అపార్ట్‌మెంట్ వాసులు.. సీసీ ఫుటేజ్‌ను పరిశీలించారు. అర్థరాత్రి ఒంటి గంట వేళ ఓ వ్యక్తి అపార్ట్‌మెంట్‌లోకి రావడం... వినాయకుడి చేతిలోని లడ్డూను తీసుకు వెళ్లడం చూసి వారాంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. అందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్‌ను అపార్ట్‌మెంట్ వాసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఇది వైరల్‌ అవుతుంది.


నెటిజన్లు కామెంట్లు..

దీనిపై నెటిజన్లు సైతం తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. ఓరి నీ దుంప తెగ.. దేవుడి లడ్డును కూడా వదల్లేదు కాదా రా అని ఒకరంటే.. పోనీలే వేలం పాట లేకుండానే లడ్డూను దక్కించుకున్నాడు లక్కీ ఫెల్లో అంటూ కామెంట్ చేశారు. అయినా వీడెవడండీ బాబు.. దేవుడి చేతిలోని లడ్డూ ఎత్తుకెళ్లాడంటూ ఇంకొకరు కామెంట్ చేశారు.

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 08 , 2024 | 05:05 PM