Share News

Flight Delay: ఆరు గంటలు ఆలస్యమైన విమానం.. సిబ్బందికి థ్యాంక్స్ చెప్పిన ప్రయాణికుడు.. ఎందుకంటే

ABN , Publish Date - Jan 19 , 2024 | 11:07 AM

సాధారణంగా వాతావరణం అనుకూలంగా లేనపుడు, సాంకేతిక సమస్యలు తలెత్తినపుడు విమానాలు ఆలస్యమవుతుంటాయి. ప్రయాణికులు గంటల తరబడి విమానాశ్రయాల్లోనే పడిగాపులు కాయాల్సి ఉంటుంది. ఆ సమయంలో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుంటారు.

Flight Delay: ఆరు గంటలు ఆలస్యమైన విమానం.. సిబ్బందికి థ్యాంక్స్ చెప్పిన ప్రయాణికుడు.. ఎందుకంటే

సాధారణంగా వాతావరణం అనుకూలంగా లేనపుడు, సాంకేతిక సమస్యలు తలెత్తినపుడు విమానాలు ఆలస్యంగా బయల్దేరుతుంటాయి (Flight Delay). ప్రయాణికులు గంటల తరబడి విమానాశ్రయాల్లోనే పడిగాపులు కాయాల్సి ఉంటుంది. ఆ సమయంలో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుంటారు. విమానయాన సంస్థ సిబ్బందితో వాగ్వాదానికి దిగుతుంటారు. ఇటీవల ఓ వ్యక్తి విమానం ఆలస్యమైందని ఏకంగా పైలెట్‌పైనే చేయి చేసుకున్నాడు (Passenger attack pilot).

తాజాగా విస్తారా ఎయిర్‌లైన్స్ (Vistara Airlines) విమానం కూడా అలాగే ఆలస్యమైంది. ఆరు గంటల పాటు ప్రయాణికులు విమానంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. అంత సేపు ఆలస్యమైనా ఓ ప్రయాణికుడు సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. దానికి కారణం సిబ్బంది ప్రవర్తనే. విస్తారా ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణించిన అక్షయ్ చతుర్వేది అనే వ్యక్తి ఓ ట్వీట్ చేశాడు. విమానం ఆరు గంటల పాటు ఆలస్యమైనా, ఆ పరిస్థితిని ఎదుర్కోవడంలో విమాన సిబ్బంది ప్రవర్తించిన తీరును అతను ప్రశంసించాడు.

Viral: జపాన్‌లో ఆ షాప్‌లో తినాలంటే రాసి పెట్టి ఉండాలి.. ఇప్పుడు ఆర్డర్ చేస్తే 38 ఏళ్ల వరకు వెయిట్ చేయాల్సిందే..

``విస్తారా ఎయిర్‌లైన్స్ విమానం ఆరు గంటలు ఆలస్యంగా బయల్దేరింది. రన్ వే మీద ఉన్న విమానంలో మేం 3 గంటల పాటు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో విమాన సిబ్బంది ప్రవర్తన అద్భుతంగా ఉంది. ఆలస్యానికి కారణమేంటో నిజాయితీగా అందరికీ వివరించారు. చిరునవ్వుతో అందరికీ క్షమాపణలు చెప్పారు. విమానంలో ప్రతి నిమిషం ఏసీ, వెంటిలేషన్ అందించారు. గంట పాటు ఆహారాన్ని అందుబాటులో ఉంచార`` తెలిపారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 95 వేల మందికి పైగా ఈ పోస్ట్ వీక్షించారు.

Updated Date - Jan 19 , 2024 | 11:25 AM